Ban on Exports: దేశంలో ద్రవ్యోల్బణం గణాంకాలు విడుదలైన ఒక రోజు తర్వాత, ప్రభుత్వం పెద్ద ప్రకటన చేసింది. ఆహార పదార్థాల ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచేందుకు ప్రభుత్వం గోధుమలు, బియ్యం, చక్కెర ఎగుమతులపై ఆంక్షలు విధించింది. ఈ వస్తువుల ఎగుమతిపై ఉన్న ఆంక్షలను తొలగించే ఆలోచనలో ప్రభుత్వం లేదని, అలాంటి ప్రతిపాదన ఏదీ తమ వద్దకు రాలేదని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ శనివారం స్పష్టం చేశారు. శుక్రవారం, నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ (NSO) డిసెంబర్ 2023కి సంబంధించిన రిటైల్ ద్రవ్యోల్బణం గణాంకాలను విడుదల చేసింది. ఇందులో ద్రవ్యోల్బణం గత 4 నెలల రికార్డును బద్దలు కొట్టింది. డిసెంబర్ 2023లో రిటైల్ ద్రవ్యోల్బణం 5.69%కి చేరుకుంది. నవంబర్ 2023లో రిటైల్ ద్రవ్యోల్బణం 5.5%గా ఉంది. దేశంలో ద్రవ్యోల్బణం రేటును 2% వరకు హెచ్చుతగ్గులకు గురిచేసే వెసులుబాటు ఉన్నప్పటికీ, దానిని 4% వద్ద ఉంచడానికి భారతీయ రిజర్వ్ బ్యాంక్ లక్ష్యంగా(Ban on Exports) పెట్టుకుంది. అటువంటి పరిస్థితిలో, రిటైల్ ద్రవ్యోల్బణం రేటు RBI గరిష్ట పరిమితి అయిన 6%కి చాలా దగ్గరగా ఉంది.
Also Read: మళ్ళీ బంగారం ధరల మోత.. ఈరోజు ఎంత పెరిగిందంటే..
ఆహార పదార్థాల ద్రవ్యోల్బణం చాలా ఎక్కువగా ఉంది
వినియోగదారుల ధరల సూచిక (CPI) ఆధారంగా రిటైల్ ద్రవ్యోల్బణాన్ని నిర్ణయించడంలో ఆహార పదార్థాల ద్రవ్యోల్బణం అతిపెద్ద అంశంగా చెప్పవచ్చు. దేశంలో ఆహార ధరల సూచిక ఆధారంగా, డిసెంబర్ 2023లో ఆహార పదార్థాల ద్రవ్యోల్బణం 9.53 శాతంగా ఉంది. నవంబర్ 2023లో ఇది 8.7 శాతం, డిసెంబర్ 2022లో 4.9 శాతంగా ఉంది. ఈ సందర్భంగా మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడుతూ, ‘గోధుమలు, బియ్యం, పంచదార ఎగుమతులపై ఎగుమతి నిషేధాన్ని(Ban on Exports) తొలగించే ప్రతిపాదన ప్రస్తుతం ప్రభుత్వం వద్ద లేదని చెప్పారు. దీనితో పాటు, భారతదేశం కూడా గోధుమలు, పంచదారాలను దిగుమతి చేసుకోదు అనీ, అలాంటి ప్రణాళిక ఏమీ లేదు లేదా దాని అవసరం లేదు అని స్పష్టం చేశారు. .
దేశీయ మార్కెట్లో పెరుగుతున్న ధరలను నియంత్రించేందుకు మే 2022లో భారత్ గోధుమల ఎగుమతిని(Ban on Exports) నిషేధించింది. దీని తరువాత, జూలై 2023 నుంచి దేశంలో బాస్మతియేతర బియ్యం ఎగుమతిపై నిషేధం ఉంది. అదే సమయంలో, 2023 అక్టోబర్లో చక్కెర ఎగుమతిని నిషేధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది.
ఇతర దేశాలతో ప్రభుత్వ స్థాయి లావాదేవీలు
బాస్మతీయేతర బియ్యం ఎగుమతిపై(Ban on Exports) భారత్ నిషేధం విధించిందని పీయూష్ గోయల్ తెలిపారు. ఇదిలావుండగా, తన మిత్రదేశాలకు ఆహార భద్రత అవసరాల కోసం బియ్యం అందిస్తోంది. భారత ప్రభుత్వ స్థాయిలో ఇండోనేషియా, సెనెగల్, గాంబియా వంటి దేశాలకు బియ్యం అందుబాటులోకి వచ్చాయి.
Watch this interesting Video: