కొందరు పార్టీని వీడినంత మాత్రనా…పార్టీకి ఒరిగిందేమీ లేదన్నారు బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, విజయశాంతి, కొండా విశ్వేశ్వర్ రెడ్డి పార్టీ మారినంత మాత్రనా పార్టీకి ఎలాంటి నష్టం లేదన్నారు. నాయకులు పార్టీ మారితే ప్రజలు వారి వెంట వెళ్లరన్నారు. తనకు జనంలో వస్తున్న ఆదరణ చూస్తుంటే భారీ మెజార్టీతో గెలవడం ఖాయమన్నారు. నూటికి నూరు శాతం ప్రజలలో భారతీయ జనతాపార్టీని గెలిపించాలన్న సంకల్పం ఉందన్నారు. బీసీ బిడ్డగా తనకు ప్రజల్లో మంచి ఆదరణ ఉందని..తనను భారీ మెజార్టీతో గెలుపించుకుంటారని ధీమా వ్యక్తం చేశారు. ఆర్టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మరిన్ని విషయాలు పంచుకున్నారు. ఆ వీడియోను పూర్తిగా చూడండి.
ఇది కూడా చదవండి: వంటగదిలో ఉండే ఈ 3 వస్తువులు తెల్లజుట్టును నల్లగా మారుస్తాయ్..అవేంటో చూద్దాం!!