Emergency Trailer: హిమాచల్ ప్రదేశ్ మండి బేజేపీ ఎంపీ,బాలీవుడ్ నటి కంగానా రానౌత్ నటించిన స్వీయ దర్శకత్వంలో నటించిన లేటెస్ట్ మూవీ ఎమర్జెన్సీ. భారత ప్రధాని ఇందిరాగాందీ జీవిత కథ ఆధారంగా రూపొందిన ఈ చిత్రంలో కంగానా ఇందిరాదేవి పాత్ర పోషించింది.
తాజాగా ఈ మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఎమర్జెన్సీ ప్రకటన తర్వాత దేశంలో ఇలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి అనే అంశాలతో ట్రైలర్ ఆసక్తికరంగా సాగింది. ఎమర్జెన్సీ సమయంలో ఇందిరాగాంధీ తీసుకున్న నిర్ణయాలు, సిమ్లా ఒప్పందాల గురించి, ఆ సమయంలో అటల్ బిహారీ వాజ్పేయి పాత్రను ట్రైలర్ లో చూపించారు. ట్రైలర్ చివరిలో ఇండియా ఈజ్ ఇందిరా, ఇందిరా ఈజ్ ఇండియా అంటూ ఇందిరాగాంధీ చెప్పే డైలాగ్స్ హైలెట్ గా నిలిచాయి.
ఈ చిత్రంలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయీ పాత్రలో శ్రేయస్ తల్పడే, జయప్రకాష్ నారాయణ్ పాత్రలో అనుపమ్ ఖేర్ నటించారు. మహిమా చౌదరి, మిలింద్ సోమన్, తదితరులు కీలక పాత్రల్లో పోషించారు. సెప్టెంబర్ 6న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
View this post on Instagram
Also Read: Double Ismart: డబుల్ ఇస్మార్ట్ మేకింగ్ వీడియో.. అదిరిపోయింది..! – Rtvlive.com