Eco Friendly Ganesh – వినాయక ఉత్సవాలపై ఆన్లైన్ క్విజ్..
ఎకో ఫ్రెండ్లీ వినాయకుడిపై అవగాహన కల్పించేందుకు అధికారులు సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.ఎకో ఫ్రెండ్లీ వినాయక విగ్రహాన్ని ప్రతిష్టించినవారిని, పర్యావరణానికి హాని కలగకుండా ఉత్సవాలు నిర్వహించేవారిని ప్రోత్సహించేందుకే నగదు బహుమతి అందించనున్నారు. పర్యావరణ హిత వినాయకుడి విగ్రహారాధనపై ఆన్లైన్ క్విజ్ సైతం నిర్వహించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం రూ.10 లక్షల వరకు నగదు బహుమతులు ఇవ్వనున్నట్లు తెలిపారు పీసీబీ సభ్య కార్యదర్శి ఎస్ కృష్ణ ఆదిత్య. పీసీబీ కార్యాలయంలో ఆయన పోటీల పోస్టర్‌ను ఆవిష్కరించారు.
ఫొటో కొట్టు..బహుమతి పట్టు..
ఈ నెల 30 వరకు పోటీల్లో పాల్గొనే వారు www.tspcb.cgg.gov.in లో సంప్రదించాలి. రాష్ట్రంలోని 33 జిల్లాల వారీగా బహుమతులుంటాయని తెలిపారు. రిజిస్ట్రేషన్ మెయిల్ ఐడీకి ఇ- సర్టిఫికెట్ పంపుతారు.ఉత్సవ కమిటీలు, మండపాల నిర్వహకులు పర్యావరణహిత విగ్రహాలు, పూజాసామగ్రి, వస్తువులతో బహుమతులు పొందవచ్చని వెల్లడించారు. ఫొటోలను పోస్ట్ చేస్తే వాటిని పరిశీలించి బహుమతులు అందజేస్తామని వ్యాఖ్యనించారు.
ఎకో ఫ్రెండ్లీ గణేశ విగ్రహాల ప్రయోజనాలుపై ఓ లుక్కేయండి:
1) కాలుష్యానికి చెక్:
ఎకో ఫ్రెండ్లీ వినాయకుడి విగ్రహం వల్ల పొల్యూషన్‌కి చెక్ పెట్టవచ్చు. మట్టితో చేసిన గణేశ్ విగ్రహాలతో పర్యావరణాన్ని కాపాడుకోవచ్చు. 100శాతం సహజమైన మట్టితో తయారు చేసిన వినాయక విగ్రహాలను సరస్సులలో లేదా మరేదైనా నీటి వనరులలో నిమజ్జనం చేసినప్పుడు అవి ఈజీగా నీటిలో కరిగిపోయి కలిసిపోతాయి. నీటి వనరులలో కలవడం వల్ల హానికరమైన రసాయనాల నిక్షేపణను నిలిపివేస్తుంది .నీటి స్వచ్ఛతను నిలుపుకోవడానికి సహాయపడుతుంది.
2) నేల నాణ్యతను సంరక్షిస్తుంది:
మట్టితో తయారు చేసిన విగ్రహాలకు రసాయనాలు ఉండవు. అందుకే నేల నాణ్యత కూడా పెరుగుతోంది. అదే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌తో చేసిన విగ్రహాలతో ల్యాండ్ పాడవుతుంది.
3) ఆరోగ్యాన్ని రక్షిస్తుంది:
పర్యావరణ అనుకూలమైన గణేష్ చతుర్థి జరుపుకోవడం వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాల్లో ఇది కూడా ఒకటి. పర్యావరణ అనుకూల విగ్రహాలను నిమజ్జనం చేయడమన్నది సహజం కాబట్టి మీ ఆరోగ్యాన్ని కాపాడడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. రంగులు, రసాయనాలు లేని అందమైన విగ్రహాలు నీటి వనరులకు లేదా పర్యావరణానికి హాని కలిగించవు. అంతేకాకుండా.. మట్టితో తయారు చేసిన గణేశ్ విగ్రహాలు జంతువులు వినియోగిస్తున్నప్పటికీ అవి ఆహార విషాన్ని సృష్టించలేవు.
సెప్టెంబర్ 19న వినాయక చవితి పండుగ ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్రవ్యాప్తంగా 2 లక్షల మట్టి గణపతి విగ్రహాలను ఉచిత పంపిణీ చేయనున్నామని పీసీబీ సభ్య కార్యదర్శి కృష్ణ ఆదిత్య తెలిపారు.
Also Read: ఇస్రో సైంటిస్టుల ఎనర్జీ సీక్రేట్ మసాలా దోస.. ఇది చదివితే మీరు కూడా ఆ టైమ్‌లో తింటారు!