Vaishnavi Chaitanya: ‘బేబి’ సినిమా సక్సెస్ తో ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది వైష్ణవీ చైతన్య(Vaishnavi Chaitanya) . తనకంటూ స్టార్ డమ్ ను క్రియేట్ చేసుకుంది. బేబి మూవీ తరువాత ఆమెకు వరుస ఆఫర్లు వస్తున్నాయి. తాజాగా ఆమె మరోసారి ఆనంద్ దేవరకొండ(Anand Devarakonda)తో జోడీ కట్టనున్నట్లు టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. ‘డ్యూయెట్’ అనే సినిమా చేయడానికి ఓకే చెప్పిందని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఆనంద్ దేవరకొండ హీరోగా మిథున్ అనే యువకుడు ఒక ప్రేమకథా చిత్రాన్ని రూపొందించడానికి రెడీ అవుతున్నాడు. ఈ సినిమాలో కథానాయిక పాత్ర కోసం ఇప్పటికే చాలామంది పేర్లను పరిశీలించారు. కానీ ఎవ్వరూ సెట్ కాలేదని.. చివరికి వైష్ణవీ చైతన్య అయితేనే ఆ పాత్రకి కరెక్టుగా సెట్ అవుతుందని భావించి, ఆమెను ఎంపిక చేసినట్టుగా తెలుస్తోంది.
సినీ పరిశ్రమలో ఒక వెలుగు వెలగాలంటే అందంతోపాటు అదృష్టం కూడా ఉండాలని చెబుతుంటారు. కొంతమంది వీటిని నిజం చేస్తుంటారు. యూట్యూబ్, వెబ్ సిరీస్, సినిమాల్లో సైడ్ క్యారెక్టర్ల చేస్తున్న ముద్దుగుమ్మ వైష్ణవి చైతన్య బేబీ సినిమాతో ఒక్కసారిగా ఫామ్ లోకి వచ్చి ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. నిజానికి ఈ కాంబినేషన్లో ‘బేబి’ నిర్మాతలే మరో సినిమా చేయాలని భావించారు. కానీ సరైన కథ సెట్ కాకపోవడం వలన, అందుకు సంబంధించిన పనులలోనే ఉన్నారు. ఈలోగానే మిథున్ దర్శకత్వంలో ఈ జంట మరోసారి ప్రేక్షకుల ముందుకు కనిపించనున్నారని సమాచారం. ఇది యూత్ ఫుల్ లవ్ స్టోరీ అని అంటున్నారు. దసరాకి ఈ సినిమాను లాంఛనంగా ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది.