ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై జరిగిన దాడిని ఖండిస్తున్నామన్నారు దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు. ‘సాక్ష్యాత్తూ సీఎం.. మంత్రి కేటీఆర్ ప్రభాకర్ రెడ్డి మీద దాడి చేసింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పారన్నారు. రకరకాల కథనాలను వారే చెబుతున్నారన్నారు. రఘునందన్ రావు వాట్సాప్ నుంచే ఈ విషయం బయటపడిందని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారని ఫైర్ అయ్యారు. అసలు తాను వాట్సాప్ వాడనప్పుడు.. వాట్సాప్ కాల్స్ ఎలా వస్తాయి.. ఎలా పోతాయని ప్రశ్నించారు. దుబ్బాక నియోజకవర్గం ప్రజల ఆశీస్సులు బీజేపీపై ఉన్నాయన్నారు. బీజేపీని ఓడించాలన్న ప్రయత్నంలో భాగంగానే ఇలాంటి ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. తప్పుడు ప్రచారాలను నమ్మొద్దని ప్రజలకు సూచించారు. ఆవేశాలకు గురి కావొద్దని కోరారు. దుబ్బాకలో రఘునందన్ రావు ఉన్నంత కాలం ఇక్కడి ప్రజలు సుఖసంతోషాలతో ఉంటారన్నారు. రఘునందన్ రావు పూర్తి ఇంటర్వ్యూను ఈ కింది వీడియోలో చూడండి.
ఇది కూడా చదవండి: నువ్వేమన్న స్వతంత్య్ర సమరయోధుడివా..ఆసుపత్రికి వెళ్లమని పంపిస్తే..ఈ హడావుడి ఏంటి..!!