Demonte Colony 2 Release : తమిళ్ సూపర్ హిట్ ‘డీమాంటే కాలనీ’ సీక్వెల్ గా రూపొందిన లేటెస్ట్ మూవీ ‘డిమాంటే కాలనీ 2’ (Demonte Colony 2). అరుల్‌నిధి, ప్రియా భవానీ శంకర్ హీరో హీరోయిన్లుగా ఆగస్టు 15న తమిళంలో విడుదలైన ఈ చిత్రం విజయవంతంగా దూసుకెళ్తుంది. “తంగళన్” (Thangalaan) వంటి భారీ చిత్రాలకు పోటీగా ప్రేక్షకాదరణ పొందుతోంది. రాజ్ వర్మ ఎంటర్టైన్మెంట్, శ్రీ బాలాజీ ఫిలిమ్స్, జ్ఞానముత్తు పట్టరై, వైట్ నైట్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ పై విజయ సుబ్రహ్మణ్యం, ఆర్సి రాజ్‌కుమార్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. అజయ్ ఆర్ జ్ఞానముత్తు దర్శకత్వం వహించారు.
డీమాంటే కాలనీ 2 తెలుగు రిలీజ్
అయితే తాజాగా ఈ మూవీ తెలుగు రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు మేకర్స్. ఆగస్టు 23న తెలుగులో గ్రాండ్ రిలీజ్ కానున్నట్లు తెలిపారు. ఇప్పటికే విడుదలైన తెలుగు ట్రైలర్‌కు భారీ రెస్పాన్స్ రావడంతో థియేటర్లలో కూడా ఇదే ఆదరణ లభిస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు నిర్మాతలు. ఈ చిత్రంలో మీనాక్షి గోవింద్రాజన్, సరనో ఖాలిద్, ఆన్తి జాస్కేలైనెస్, సెరింగ్ డోర్జీ, అరుణ్ పాండియన్, ముత్తుకుమార్, అర్చన రవిచంద్రన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. హారర్ థ్రిల్లర్లను ఇష్టపడేవారిని ఈ సినిమా బాగా ఆకట్టుకుంటున్నట్లు తెలుస్తోంది.