Deepika Padukone: ఈ ఏడాది ఫిబ్రవరిలో దీపికా- రణ్వీర్ తాము పేరెంట్స్ కాబోతున్నారని శుభవార్తను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ప్రస్తుతం దీపికా తన ప్రెగ్నెన్సీ పీరియడ్ ఎంజాయ్ చేస్తోంది. తాజాగా తన ఇన్స్టాగ్రామ్లో తన ఫస్ట్ మెటర్నిటీ షూట్ ఫొటోలను పంచుకుంది. ఈ ఫొటోల్లో దీపికా తన బేబీ బంప్ ను ప్రదర్శిస్తూ ఎంతో సంతోషంగా, ఆనందంగా కనిపించింది. భర్త రణ్వీర్ (Ranveer Singh) కూడా దీపికా మెటర్నిటీ షూట్ లో పాల్గొన్నారు. ఇద్దరు తమ బేబీ బంప్ ను ప్రేమగా పట్టుకొని ఫొటోలకు ఫోజిలిచ్చారు. దీపికా తన మెటర్నిటీ షూట్ కోసం స్టైలిష్ బ్లాక్ బ్రాలెట్ సూట్ ధరించింది. దానికి తోడు ఆమె మనోహరమైన చిరునవ్వు అందాన్ని మరింత పెంచేసింది.
సోషల్ మీడియాలో షేర్ చేసిన ఈ ఫోటోలకు దీపికా ఇన్ఫినీటీ ఇమోజీలను జోడించడంతో పాటు దిష్టితగలకుండా కంటి ఇమోజీని జోడించింది. ఈ ఫొటోలు ప్రస్తుతం నెట్టింట అందరి దృష్టిని ఆకట్టుకుంటున్నాయి. ఫ్యాన్స్ తో పాటు బాలీవుడ్ సెలెబ్రెటీలు కూడా దీపికా పోస్టుకు లైకులు వర్షం కురిపిస్తున్నారు. ప్రియాంకా చోప్రా, కత్రినా కైఫ్ హార్ట్ ఇమోజీతో రిప్లై పెట్టారు.
Image Credits: Deepika Padukone/ Instagram
Image Credits: Deepika Padukone/ Instagram
Image Credits: Deepika Padukone/ Instagram
Image Credits: Deepika Padukone/ Instagram
Image Credits: Deepika Padukone/ Instagram
View this post on Instagram
Also Read: NTR: తెలుగు రాష్ట్రాల వరద బాధితులకు NTR రూ. కోటి విరాళం..! – Rtvlive.com