Darling: టాలీవుడ్ పాపులర్ కమెడియన్ ప్రియదర్శి, ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ హీరో హీరోయిన్స్ గా నటించిన లేటెస్ట్ మూవీ ‘డార్లింగ్’. కామెడీ ఎంటర్టైనర్ గా జులై 19 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం థియేటర్స్ లో నవ్వులు పూయించింది. అశ్విన్ రామ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అనన్య నాగళ్ల, మొయిన్, శివా రెడ్డి, మురళీధర్ గౌడ్, కళ్యాణి రాజ్, సునీత మనోహర్, ముళ్లపూడి రాజేశ్వరి, అభిజ్ఞ, జీవన్, కృష్ణ తేజ, విష్ణు, సంజయ్ స్వరూప్, రఘు బాబు, ప్రియాంక, స్వప్నిక, శివరంజని, తదితరులు కీలక పాత్రలు పోషించారు.
డార్లింగ్ ఓటీటీ రిలీజ్
ఇప్పటి వరకు థియేటర్స్ లో అలరించిన ఈ చిత్రం.. తాజాగా ఓటీటీ విడుదలకు సిద్ధమైంది. ‘డార్లింగ్’ ఓటీటీ రిలీజ్ డేట్ చేశారు మేకర్స్. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ డిస్నీ హాట్ స్టార్ లో ఆగస్టు 13 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు పోస్టర్ విడుదల చేశారు. ప్రైమ్ షో ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్ పై నిరంజన్ రెడ్డి, చైతన్య ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించారు.
Telugu film #Darling will premiere on Disney+ Hotstar on August 13th. pic.twitter.com/K5cvTwGGlu
— Streaming Updates (@OTTSandeep) August 2, 2024
మూవీ స్టోరీ
ఓ ట్రావెల్ ఏజెన్సీలో ఏజెంట్ గా పనిచేస్తున్న హీరో ప్రియదర్శి.. అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకొని.. ఆమెతో కలిసి సంతోషంగా పారిస్ కు హానీమూన్ వెళ్లాలని కళలు కంటాడు. తీరా హీరో కోసం నిశ్చయించిన అమ్మాయి తాను ప్రేమించిన వేరే అబ్బాయితో వెళ్ళిపోతుంది. ఇక పెళ్లి పీటల పై ఆగిపోవడంతో హీరో ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంటాడు. అదే సమయంలో హీరో లైఫ్ లోకి హీరోయిన్ నభా నటేష్ ఎంట్రీ ఇస్తుంది. ఇక పరిచయమైన కొద్ది సమయంలోనే హీరో ఆమెకు ప్రపోజ్ చేయడం.. వారిద్దరికి పెళ్లి జరగడం అయిపోతుంది. అయితే ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరో మొదటి రోజే భార్య (నభా) చేతిలో చావు దెబ్బలు తింటాడు. ఇక తన భార్య ఒక్కోకోసారి ఒక్కో విధంగా ప్రవర్తిస్తూ ఉంటుంది. దానికి కారణం ఆమెకు ఉన్న స్ల్పిట్ పర్సనాలిటీ డిజార్డర్. ఇక దీని వల్ల రాఘవ ఎన్ని తిప్పలు పడ్డాడు అనేది సినిమా కథ.
Also Read: Saripodhaa Sanivaaram: సరిపోదా శనివారం అప్డేట్.. నాని యాక్షన్ మోడ్..! పోస్టర్ అదిరింది – Rtvlive.com