Padma Shri Awardee Kinnera Mogulaiah: పద్మశ్రీ అవార్డు గ్రహీత, ప్రముఖ జానపత కళాకారుడు దర్శనం మొగలయ్య రోజువారీ కూలీగా మారి జీవనం సాగిస్తున్నారు. హైదరాబాద్ లోని తుర్కయమంజాల్‌లో ఓ నిర్మాణ స్థలంలో పని చేస్తూ కనిపించారు. అందుకు సంబంధించిన వీడియాలో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తన నెలవారీ గౌరవ వేతనం ఆగిపోయిందని.. అందుకే పొట్టకూటి కోసం కూలీపనులకు వెళ్తున్నట్లు ఆయన వివరించారు.
తన కుమారుల్లో ఒకరు మూర్ఛతో బాధపడుతున్నారు. తన ఆరోగ్య పరిస్థితి అంతత మాత్రమే. మందుల కోసం నెలకు కనీసం రూ. 7,000 లు కావాలని …. సాధారణ వైద్య పరీక్షలు, ఇతర ఖర్చులు ఉన్నాయి. తన మీదనే ఆధారపడిన కుటుంబం ఉందని.. అందుకే కూలీ పనులకు వెళ్తున్నా’ అని మెుుగులయ్య చెప్పుకొచ్చారు.
గత ప్రభుత్వం మంజూరు చేసిన రూ. 10,000 నెలవారీ గౌరవ వేతనం ఇటీవల ఆకస్మాత్తుగా నిలిపివేశారని మెుగులయ్య ఆవేదన వ్యక్తం చేశారు. అలా ఎందుకు జరిగిందో తనకు తెలియదని అన్నారు. ఇంట్లో పూటగడవటం కూడా కష్టంగా ఉందని అందుకే తాను పని కోసం చాలా చోట్లు ప్రయత్నించానని అన్నారు. తనపై సానుభూతి చూపించి.. మర్యాదపూర్వకంగా తనకు పని ఇవ్వలేదన్నారు. తన ప్రతిభను గుర్తించి చిన్న మొత్తంలో సాయం చేసినా.. దాని వల్ల ఎలాంటి ఉపాధి లభించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
‘గత ప్రభుత్వం నాకు రూ. కోటి రూపాయలు గ్రాంట్‌గా ఉచ్చింది. ఆ డబ్బును నేను నా పిల్లల పెళ్లిళ్ల కోసం ఉపోయోగించాను. తుర్కయంజాల్‌లో కొంత భూమిని కూడా కొన్నాను. ఇంటి నిర్మాణం కూడా ప్రారంభించాను. అయితే సరిపడా డబ్బులు లేకు మధ్యలోనే ఆపేశాను. ఇక రంగారెడ్డి జిల్లాలో 600 చదరపు గజాల స్థలం ఇస్తామని గత ప్రభుత్వం హామీ ఇచ్చింది. అది ఇప్పటికీ పెండింగ్‌లోనే ఉంది. రంగారెడ్డి కలెక్టర్ కార్యాలయానికి మూడుసార్లు వెళ్లాను. ప్రతిసారీ కొత్త కలెక్టర్ వస్తున్నారు.. నన్ను బాగా రిసీవ్ చేసుకొని నా యోగక్షేమాలు అడిగి త్వరలో హయత్‌నగర్ దగ్గర స్థలం కేటాయిస్తామని చెబుతున్నారు తప్ప ఏం చేయటం లేదు.’ అని అన్నారు.
ఇటీవల తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సిఎం మల్లు భట్టి విక్రమార్కలను మెుగులయ్య కలిశారు. తన సమస్యలపై వారికి విన్నవించగా.. మంత్రి కొండా సురేఖను సీఎం ఆదేశించారని, తన సమస్యలు తీరుస్తానని సీఎం హామీ ఇచ్చారని చెప్పారు.
Also read: రాయ్‌బరేలీ నుంచి రాహుల్..అమేథీ నుంచి బరిలో ఎవరంటే!