TSRTC: తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు సంస్థ ఎండీ సజ్జనార్ (Sajjanar) శుభవార్త చెప్పారు. తమ సంస్థ ఉద్యోగులకు పెండింగ్ లో ఉన్న కరువు భత్యాలు(డీఏ) అన్నింటినీ మంజూరు చేసినట్లు ప్రకటించారు. ఈ ఏడాది జులై నుంచి ఇవ్వాల్సి ఉన్న 4.8 శాతం డీఏను కూడా సిబ్బందికి మంజూరు చేయాలని యాజమాన్యం తాజాగా నిర్ణయించిందని ఆయన వెల్లడించారు. అక్టోబర్ నెల వేతనంతో కలిపి ఈ డీఏను సిబ్బందికి చెల్లిస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతా ద్వారా ప్రకటన విడుదల చేశారు.
ఇది కూడా చదవండి: Viral Video: ఇలా చేస్తే ప్రాణాలు పోతాయ్.. షాకింగ్ వీడియోలు షేర్ చేసిన సజ్జనార్ ఐపీఎస్
టీఎస్ఆర్టీసీ ఉద్యోగులు కష్టపడి పని చేస్తున్నారని అన్నారు. ప్రయాణికులకు మెరుగైన, నాణ్యమైన సేవలందిస్తూ.. వారిని క్షేమంగా, సురక్షితంగా గమ్యస్థానాలకు చేరవేస్తున్నారని కొనియాడారు. సంస్థ వృద్ధిలో ఉద్యోగుల పాత్ర కీలకం అని సజ్జనార్ అన్నారు. ఉద్యోగుల సంక్షేమానికి సంస్థ అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు.
తమ ఉద్యోగులకు పెండింగ్ లో ఉన్న కరువు భత్యాలు(డీఏ) అన్నింటినీ మంజూరు చేసినట్లు #TSRTC మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనర్, ఐపీఎస్ గారు(@SajjanarVC) తెలిపారు. ఈ ఏడాది జులై నుంచి ఇవ్వాల్సి ఉన్న 4.8 శాతం డీఏను కూడా సిబ్బందికి మంజూరు చేయాలని యాజమాన్యం తాజాగా నిర్ణయించిందని ఆయన… pic.twitter.com/nqLnQC3IpM
— VC Sajjanar – MD TSRTC (@tsrtcmdoffice) October 4, 2023
క్లిష్ట పరిస్థితుల్లోనూ 2019 నుంచి విడతల వారిగా ఇప్పటివరకు 9 డీఏలను మంజూరు చేసిన విషయాన్ని ఈ సందర్భంగా సజ్జనార్ గుర్తు చేశారు. తాజా డీఏ మంజూరుతో అన్ని డీఏలను సంస్థ ఉద్యోగులకు చెల్లించిందని టీఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనర్, ఐపీఎస్ తెలిపారు.