Current Cut Problems : వరంగల్ (Warangal) – ఎంజీఎం ఆసుపత్రి (MGM Hospital) లో దారుణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. మంగళవారం సుమారు అయిదు గంటలకు పైగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. సాయంత్రం 4.30 గంటలకు పోయిన కరెంటు.. రాత్రి 9.30 గంటలకు వచ్చింది. చాలా వార్డుల్లో కరెంట్ లేకపోవడంతో రోగులు, వైద్యులు తీవ్ర అవస్థలు పడ్డారు. వేసవి ఉక్కపోతకు ఇబ్బంది పడ్డారు. కరెంట్ లేక సెలైన్ బాటిల్ (Saline Bottle) పట్టుకుని రోగులు బైటికొచ్చిన పరిస్థితి కనిపించింది.
Also Read : వరంగల్ లో కామారెడ్డి ఎమ్మెల్యే ప్రచారం