“#CULT “: మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ఏం చేసినా వైవిధ్యంగా ఉంటుంది. ఈ క్రమంలో హ్యాష్‌ట్యాగ్ కల్ట్ పేరుతో కొత్త సినిమా అనౌన్స్ చేయడం జరిగింది. ఇక ఈ సినిమాలో కొత్త వారికి అవకాశం ఇస్తున్నట్లు విశ్వక్ ప్రకటించాడు.
విశ్వక్ మరో ప్రయోగానికి శ్రీకారం
పాగల్ చిత్రంతో టాలీవుడ్ లో తన కంటూ ఓ ప్రత్యేకతను సొంతం చేసుకున్న హీరో విశ్వక్ సేన్. నటుడిగానే కాకుండా , దర్శకుడిగా తన స్టామినా చూపిస్తూనే ఉన్నాడు. హీరోగా నటిస్తూనే ‘ఫలక్‌నుమా దాస్’, ‘దాస్ కా ధమ్కీ’ చిత్రాలకి రచన, దర్శకత్వం వహించడంతో పాటు నిర్మాణ భాద్యతలు కూడా చేపట్టి డేరింగ్ అండ్ డ్యాషింగ్ పర్సనాలిటీగా పేరుతెచ్చుకున్నారు. ఇక తాజాగా యాంగ్ టాలెంట్‌ని ప్రోత్సహించేందుకు తన హోమ్ బ్యానర్లు వన్మయే క్రియేషన్స్, విశ్వక్సేన్ సినిమాస్ ద్వారా మరో ప్రయోగానికి శ్రీకారం చుట్టాడు.
హ్యాష్‌ట్యాగ్ కల్ట్ మూవీలో 25 మంది కొత్త వారికి అవకాశం
విశ్వక్సేన్ చిత్రాలు చాలా డిఫరెంట్ గా ఉంటాయి. ఆయా చిత్రాల టైటిల్స్ విషయంలో కూడా చాలా శ్రద్ద వహిస్తాడు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఆయన అనౌన్స్ చేసిన కొత్త మూవీకి కల్ట్ అనే సరికొత్త క్యాచీ టైటిల్ అనౌన్స్ చేసాడు విశ్వక్. లైక్ ఎ లీప్ ఇయర్ 2024 అనేది సినిమా ట్యాగ్‌లైన్. సే నో టు డ్రగ్స్ అనే స్లోగన్‌తో పోస్టర్ రిలీజ్ చేశారు. టైటిల్ పోస్టర్లో డ్రగ్స్ ట్యాబ్లెట్లు, పౌడర్ల రూపంలో కనిపిస్తున్నాయి. ఈ చిత్రం కామెడీ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ చిత్రానికి విశ్వక్ సేన్ కథను ఇవ్వగా తాజుద్దీన్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ప్రొడక్షన్ లాంచ్ ప్రెస్ మీట్లో విశ్వక్ సేన్ మాట్లాడుతూ.. ఈ కల్ట్ మూవీ ప్లానింగ్ ఒక సంవత్సరం నుంచి జరుగుతోందని , తనకు కామెడీ టైమింగ్ లో శిక్షణ ఇచ్చిన తాజుద్దీన్ గారికి దర్శకుడిగా అవకాశం ఇస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. ఫలక్‌నుమా దాస్ అంతటి సక్సస్ అవడానికి ప్రధాన కారణం తాజుద్దీన్ అని చెప్పారు. ఈ సినిమా ద్వారా 25 మంది కొత్తవారికి అవకాశం ఇస్తున్నట్లు వెల్లడించారు.
హిలేరియస్ కామెడీ ఎంటెర్టైనర్
హిలేరియస్ కామెడీ ఎంటెర్టైనర్ గా సాగుతూ అండర్ కరెంట్ గా చిన్న సందేశం ఉంటుందని తెలియజేసారు.నాకు కూడా చిన్న వేషం ఇస్తే చేస్తానని , నేను కూడా అందరితో పాటు వన్ మినిట్ వీడియో ఆడిషన్ కోసం పంపిస్తానని విశ్వక్ చెప్పడం విశేషం. ఈ స్టోరీ ముగ్గురు లూజర్స్ కథ అని .. ఈ కథలో చాలా లేయర్స్ ఉంటాయని సినిమా గురించి చెప్పారు. అనంతరం ఈ మూవీ గురించి పాత్రికేయులు అడిగిన ప్రశ్నలకు చాలా ఆశక్తికర సమాధానాలిచ్చారు. ప్రస్తుతం విశ్వక్ సేన్ హీరోగా రాబోతోన్న గ్యాంగ్స్ అఫ్ గోదావరి చిత్ర రిలీజ్ గురించి చాలా ఫన్నీ కామెంట్స్ చేశారు.
ALSO READ :HAPPY NEW YEAR 2024 న్యూ ఇయర్లో ఇలా చేయండి.. ఖచ్చితంగా మీ సంతకం ఆటోగ్రాఫ్ అవడం ఖాయం