Credit Card Network: ఇప్పుడు క్రెడిట్ కార్డ్ తీసుకుంటున్నప్పుడు, మీకు నచ్చిన విధంగా కార్డ్ నెట్వర్క్ని ఎంచుకునే సౌలభ్యం మీకు లభిస్తుంది. క్రెడిట్ కార్డ్ నెట్‌వర్క్‌లు మరియు కార్డ్ జారీ చేసే బ్యాంకులు – NBFCలకు RBI కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. దీని ప్రకారం, ఇప్పుడు కార్డ్ జారీచేసేవారు క్రెడిట్ కార్డ్‌లను జారీ చేసేటప్పుడు ఒకటి కంటే ఎక్కువ కార్డ్ నెట్‌వర్క్‌లను ఎంచుకోవడానికి తన వినియోగదారులకు ఎంపికను ఇవ్వాలి. ఖాతాదారుడికి ఏ నెట్వర్క్ క్రెడిట్ కార్డ్ కావాలో బ్యాంకులు అడగాలి.
పాత క్రెడిట్ కార్డ్ వినియోగదారులు కార్డును రెన్యూవల్ చేసుకునేటప్పుడు కార్డ్ నెట్వర్క్(Credit Card Network)ను మార్చుకునే అవకాశాన్ని పొందుతారు. ప్రతి క్రెడిట్ కార్డ్‌కు గడువు తేదీ అంటే చెల్లుబాటు తేదీ ఉంటుంది. కార్డు గడువు ఒకటి, రెండు, మూడు సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం ఉండవచ్చు. కార్డ్ గడువు ముగిసిన తర్వాత మీరు నెట్వర్క్ని మార్చుకునే అవకాశం కల్పిస్తారు.
ఈ కంపెనీలకు నిబంధనలు వర్తించవు..
కొత్త గైడ్ లైన్స్ ప్రకారం, 10 లక్షలు లేదా అంతకంటే తక్కువ కార్డులు జారీ చేసిన సంస్థలకు ఈ నిబంధనలు వర్తించవు. అంతేకాకుండా, వారి స్వంత అధీకృత కార్డ్ నెట్వర్క్(Credit Card Network)లలో క్రెడిట్ కార్డ్‌లను జారీ చేసే వారినీ ఈ నిబంధనల నుంచి మినహాయించారు. నోటిఫికేషన్ తేదీ నుండి 6 నెలల వరకు ఈ నియమాలు అమలులో ఉంటాయి.
క్రెడిట్ కార్డ్ నెట్వర్క్..
ప్రస్తుతం భారతదేశంలో 5 కార్డ్ నెట్వర్క్ కంపెనీలు ఉన్నాయి – వీసా, మాస్టర్ కార్డ్, రూపే, అమెరికన్ ఎక్స్‌ప్రెస్ మరియు డైనర్స్ క్లబ్. ఈ కంపెనీలు వివిధ ఆర్థిక సంస్థలతో టై-అప్‌లను కలిగి ఉన్నాయి. దీని కారణంగా, కస్టమర్ తనకు నచ్చిన కార్డ్ నెట్‌వర్క్‌ను ఎంచుకునే అవకాశం లభించదు.
క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు ప్రయోజనం ఏమిటి?
క్రెడిట్ కార్డు నెట్ వర్క్(Credit Card Network) యాన్యువల్ ఫీజులు ఒక్కవు నెట్ వర్క్ కి ఒక్కోరకంగా ఉంటాయి. అందువల్ల మీరు క్రెడిట్ కార్డు తీసుకుంటున్న బ్యాంకుతో ఒప్పందం ఉన్న నెట్ వర్క్ ఫీజులు ఎక్కువగా ఉంటే , మీ కార్డుకు ఎక్కువ ఫీజులు చెల్లించాల్సి వస్తుంది. ఎందుకంటే, ఇప్పుడు ఉన్న విధానం ప్రకారం మీరు క్రెడిట్ కార్డు తీసుకుంటున్న కంపెనీ లేదా బ్యాంక్ ఏ నెట్ వర్క్ మీకు ఇస్తే దాని ప్రకారమే మీకు కార్డు వస్తుంది. వేరేదారి ఉండడం లేదు. అయితే, ఇప్పుడు ఆర్బీఐ గైడ్ లైన్స్ తో పరిస్థితి మారుతుంది. మీకు నచ్చిన నెట్ వర్క్ లో మీరు కార్డు తీసుకోవచ్చు. మీరు కార్డు తీసుకునేటప్పుడు ఆయా నెట్ వర్క్ లలో అందుబాటులో ఉన్న సౌకర్యాలు, ఫీజులు అన్నిటినీ సరి చూసుకుని మీకు నచ్చిన నెట్ వర్క్ ఎంచుకోవచ్చు.
Also Read: వినియోగదారులకు బ్యాంకులు షాక్.. KYC ప్రక్రియ ఇక మరింత కఠినతరం!
అతిపెద్ద కార్డ్ కంపెనీ వీసా, రెండవది మాస్టర్ కార్డ్..
ప్రపంచంలో అతిపెద్ద కార్డ్(Credit Card Network) కంపెనీ వీసా. ఇది 200 కంటే ఎక్కువ దేశాలు, భూభాగాల్లో ఉంది. దీని మార్కెట్ క్యాప్ రూ.489.50 బిలియన్లు అంటే దాదాపు రూ.40 లక్షల కోట్లు. వీసా తర్వాత, ప్రపంచంలో రెండవ అత్యంత ప్రజాదరణ పొందిన క్యాష్ లెస్ పేమెంట్ సంస్థ మాస్టర్ కార్డ్. ఇప్పుడు మాస్టర్ కార్డ్ 150 దేశాలలో ఉంది. దాని మార్కెట్ క్యాప్ రూ. 372.55 బిలియన్లు అంటే దాదాపు రూ. 30 లక్షల కోట్లు.
మన దేశ నెట్వర్క్ రూపే..
రూపే భారతదేశంలో మొట్టమొదటి దేశీయ డెబిట్ – క్రెడిట్ కార్డ్ చెల్లింపు నెట్వర్క్(Credit Card Network). ఈ పేరు రూపాయి-పేమెంట్ అనే రెండు పదాలతో రూపొందించారు. విదేశీ కార్డ్ నెట్‌వర్క్‌ల గుత్తాధిపత్యాన్ని అంతం చేయడానికి దీనిని మార్చి 2012లో ప్రారంభించారు.
దేశంలో ప్రస్తుతం 8 కోట్ల మందికి పైగా క్రెడిట్ కార్డ్ వినియోగదారులు..
బ్యాంక్ బజార్ నివేదిక ప్రకారం, ఏప్రిల్ 2023 నాటికి భారతదేశంలో 8.6 కోట్ల క్రెడిట్ కార్డులు చెలామణిలో ఉన్నాయి. ఈ సంఖ్య ఏప్రిల్ 2022లో 7.5 కోట్ల నుండి 15% పెరిగింది. 2024 ఆర్ధిక సంవత్సరం ప్రారంభం నాటికి క్రెడిట్ కార్డుల సంఖ్య 10 కోట్లు దాటుతుందని భావిస్తున్నారు.