సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో సైబర్ క్రైమ్ కేసులు పెరిగియాన్నారు సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి. గతేడాది కంటే ప్రస్తుతం కేసులు పెరిగాయని తెలిపారు. వార్షిక నేర నివేదికను ఆయన విడుదల చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు అవినాష్ మహంతి. గతేడాది 4,850 కేసులు నమోదు అయ్యాయి. ప్రస్తుతం 5,342 కేసులు నమోదు అయినట్లు సీపీ పేర్కొన్నారు. ఈ ఏడాది రూ. 232 కోట్ల నగదు మోసం జరిగిందన్నారు. ఈ ఏడాది 277 డ్రగ్స్ కేసుల్లో 567మందిని అరెస్టు చేసినట్లు అవినాష్ మహంతి వెల్లడించారు. ఈ ఏడాది రెండు పీడి యాక్ట్ కేసులు నమోదు చేశామన్న సీపీ రూ. 27.82కోట్ల విలువైన డ్రగ్స్ సీజ్ చేసినట్లు చెప్పారు.
సైబరాబాద్ పరిధిలో ఆర్థిక, స్థిరాస్తి నేరాలు కూడా పెరిగాయన్న సీపీ…మహిళలపై నేరాలు తగ్గాయని తెలిపారు. గతేడాది 2,489 కేసులు నమోదు కాగా…ప్రస్తుతం 2,356కేసులు నమోదు అయినట్లు చెప్పారు. అత్యాచారం కేసులు కూడా తగ్గాయని..మోసాలకు సంబంధించి 2022లో 6,276 కేసులు వచ్చాయని..ఈ ఏడాది 6,777కేసులు వచ్చాయని తెలిపారు. రోడ్డు ప్రమాదాలు కూడా పెరిగాయని,హత్య కేసులు 2022లో 93 కేసులు నమోదు కాగా ప్రస్తుతం 105కేసులు వచ్చినట్లు తెలిపారు. ఈ ఏడాది 52,124 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు అయ్యాయని వెల్లడించారు.
-105 హత్యలు
-61 చైన్ స్నాచింగ్
-62 రాబరిలు
-7 డేకాయిటి
-2353 దొంగ తనాలు
-616 కిడ్నాప్ లు
-259 రేప్ కేసులు
-6777 మోసాలు
-116 హత్య యత్నాలు
గత ఏడాదితో పోలిస్తే 8 శాతం క్రైమ్ రెట్ పెరిగిందని సీపీ తెలిపారు. ఇక ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో దర్యాప్తు కొనసాగుతోందని సీపీ తెలిపారు. త్వరలో ఈ కేసు వివరాలను అందిస్తామన్నారు. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పై హత్య కుట్ర కేసు దర్యాప్తు జరుగుతుందని సీపీ వెల్లడించారు.
ఇది కూడా చదవండి: ఎన్ని సంవత్సరాలైనా రామమందిరం గోడలు మెరుస్తూనే ఉంటాయట..కారణం ఏంటో తెలుసా?