YS Sharmila Tirupati Meeting : ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) లో కాంగ్రెస్ పార్టీ(Congress Party) కి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిలను నియమించింది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం. పార్టీ అద్యక్షురాలిగా బాధ్యతలు చెప్పయిన వెంటనే కాంగ్రెస్ పార్టీ నేతలతో జిల్లాల వారీ సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. శ్రీకాకుళం నుంచి 9 రోజుల పాటు సాగే వైఎస్ షర్మిల జిల్లాల పర్యటన నేడు (జనవరి28) తిరుపతికి చేరుకుంది. తిరుపతి జిల్లా కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరైన APCC చీఫ్ వైఎస్ షర్మిల ఆ జిల్లా పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపారు.ఈ సమావేశానికి కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు పల్లం రాజు,రఘువీరా రెడ్డి,కొప్పుల రాజు,గిడుగు రుద్రరాజు ఇతర నేతలు హాజరయ్యారు.
వైఎస్ షర్మిలా రెడ్డి ఇక్కడ
ఒకప్పుడు వైసీపీ(YCP) ని నా భుజాలపై వేసుకొని 3200కి.మీ. పాదయాత్ర చేసి ఆ పార్టీని నిలబెట్టి అధికారంలోకి తేవడం జరిగిందని , అయినా ఈ రోజు అ పార్టీ నేతలకు కనీసం కృతజ్ఞత కూడా లేదని, నా మీద, నా వ్యక్తిగత జీవితం మీద, నా పేరు మీద నానా రకాలుగా దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. అయినా భయపడేది కాదు వైఎస్సార్ బిడ్డ, పులి కడుపున పులే పుడుతుంది.. నా ఒంట్లో ఉన్నది వైఎస్సార్ రక్తం.. వైఎస్ షర్మిలా రెడ్డి(YS Sharmila Reddy) ఇక్కడ అంటూ అ పార్టీ నాయకులను హెచ్చరించారు. నా గుండెలో నిజాయితీ ఉందిఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అన్యాయం జరగుతుందని ..ప్రత్యేక హోదా రావాలని… పోలవరం రావాలని.. రాజధాని రావాలని… ప్రజలను మేలు జరగాలని నా పుట్టింటికి వచ్చా అంటూ తన వాగ్దాటితో అందరిలోనూ ఉత్సాహాన్ని నింపారు. నన్ను ఎంత తిట్టినా పర్వాలేదు.. నా మీద ఎన్ని నిందలు వేసినా పర్వాలేదు.. ఎంతటి త్యాగానికి అయినా నేను సిద్ధం… ఎంతటి పోరాటానికి అయినా నేను సిద్ధంనేను రెడీ… మీరు రెడీనా..! అంటూ పార్టీ శ్రేణులను యుద్దానికి సన్నద్ధం కమ్మని పిలుపునిచ్చారు.
మాట నిలబెట్టుకోని మీరూ మోడీ అవుతారా ? కేడి అవుతారా ?
ఇదే తిరుపతి(Tirupati) లో నిలబడి మోడీ గారు ఏపి కి ప్రత్యేక హోదా ఇస్తామని మాట ఇచ్చారు కాంగ్రెస్ ఇచ్చే 5 ఏళ్లు సరిపోదు.. 10 ఏళ్లు కావాలని చెప్పారు, బీజేపీ అధికారంలో వస్తె హోదా వస్తామని మాట ఇచ్చారు10 ఏళ్లు కాదు..15 ఏళ్లు కావాలని చంద్రబాబు ఇదే పవిత్ర ప్రదేశంలో నిలబడి అడిగారు,ఇచ్చిన మాట ఏమయ్యింది అని మోడీని అడుగుతున్నాం .. మాట నిలబెట్టుకోని మీరూ మోడీ అవుతారా ? కేడి అవుతారా ?మాట నిలబెట్టుకోని మీరు కేడి అవుతారంటూ మోడీపై ధ్వజమెత్తారు.
Also Read : AP Cabinet : ఏపీ రైతులకు గుడ్ న్యూస్.. త్వరలో రైతు రుణమాఫీ?
జగన్,బాబు ఆలిబాబా అరడజన్ దొంగలు
హోదా కోసం మనికోటి అనే బిడ్డ పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకున్నారు..ఆంధ్రరాష్ట్ర ప్రజలకు మోడీ చేసింది పాపం..అన్యాయం , బీజేపీ కే డి ల పార్టీ… కే డి పార్టీకి మద్దతు తెలిపిన బాబు,జగన్ ఆన్న కే డి లు కారా..? జగన్,బాబు ఆలిబాబా అరడజన్ దొంగలని, ప్రత్యేక హోదా వచ్చి ఉంటే.. రాష్ట్రాన్ని ఎన్నో పరిశ్రమలు వచ్చేవి, లక్షల్లో ఉద్యోగాలు వచ్చేవి అని జగన్ , చంద్రబాబులపై ఆగ్రహం వ్యక్తం చేసారు.
రాజధాని లేదు..పోలవరం లేదు..హోదా లేదు
పోలవరం ప్రాజెక్ట్ కి కాంగ్రెస్ జాతీయ హోదా ఇస్తే… నిధులు ఇవ్వని మోడీ ఒక కేడి..రాజధాని కి సహకారం ఇవ్వని మోడీ ఒక కేడి బాబు అమరావతి అని..సింగపూర్ అని 3D గ్రాఫిక్స్ చూపించారుజగన్ ఆన్న మూడు రాజధానులు అన్నారు..చివరికి ఒక్క రాజధాని కూడా లేదు..కనీసం ఆంధ్ర రాష్ట్రంలో ఒక్క మెట్రో కూడా లేదు.ఆంధ్ర ప్రజలు అంతా తీసి పోయారా..?మాకు రాజధాని లేదు..పోలవరం లేదు..హోదా లేదు,మోడీ మనకు వెన్నుపోటు కాదు..కడుపులో పొడిచాడు..అయినా జగన్ ఆన్న, బాబు ఇద్దరు బీజేపీ కి బానిసలు అయ్యారు. మోడీ మనకు హోదా ఇచ్చారని..బానిసలు అయ్యారా ..ప్రాజెక్టులు ఇచ్చారని బజన చేస్తున్నారా ?రాజధాని కి సహాయం చేసిందని బానిసలు గా మారారా ?ఒక్కటంటే ఒక్కటి కూడా మేలు చేయలేదు,వీళ్ళు బానిసలు అయ్యి..ఆంధ్ర రాష్ట్ర ప్రజలను బానిసలు చేయాలని చూస్తున్నారుఒక్క సీటు గెలవని బీజేపీ ఆంధ్ర లో రాజ్యం ఏలుతుందని,ఏమి చేయక పోయినా సచ్చినట్లు పడి ఉంటారు అని బీజేపీ అనుకుంటుందని బిజెపిని షర్మిల కడిగిపారేశారు.,
హంద్రీనీవా ప్రాజెక్టు ఏమయింది ?
హంద్రీనీవా ప్రాజెక్టు గురించి మాట్లాడుతూ .. రాయల సీమను రతనాల సీమగా, సస్యశ్యామలంగా మార్చే ప్రాజెక్ట్ హంద్రీనీవా ప్రాజెక్టు. హంద్రీనీవా ప్రాజెక్టు 6.50లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చే ప్రాజెక్ట్… 33 లక్షల మంది ప్రజలకు సాగునీరు ఇచ్చే ప్రాజెక్ట్.. ఇలాంటి ప్రాజెక్టును వైఎస్సార్ హయాంలో 4 వేల కోట్లతో 90 శాతం పనులు పూర్తి చేశారు. బాబు హయాంలో 10 శాతం పనులు పూర్తి చేయడం చేతకాలేదు అని జగన్ ఏద్దేవా చేశారు. మరి జగన్నన ముఖ్యమంత్రి అయ్యాక ఆ 10 శాతం పనులు కూడా పూర్తి చేయలేక పోయాడు.ఎన్నికల్లో జగన్ ఆన్న హామీ ఇచ్చాడు..6 నెలల్లో పూర్తి చేస్తామని చెప్పారు .6 నెలలు కాదు కదా … 60 నెలలు కూడా పూర్తి కాలేదంటూ జగన్ ,బాబులపై ఫైర్ అయ్యారు.
మీరు వైఎస్సార్ వారసులు ఎలా అవుతారు ?
గాలేరు నగరి ప్రాజెక్ట్ ను అటకెక్కించారు. వైఎస్సార్ కట్టిన ప్రాజెక్టులను పూర్తి చేయని మీరు వైఎస్సార్ వారసులు ఎలా అవుతారు ?వైఎస్సార్ హయాంలో వచ్చిన నీళ్ళే తప్పా ..వారసులు ఒక్క ఎకరాకు కూడా నీళ్ళు ఇవ్వలేదు. జగన్ పాలనకు వైఎస్సార్ పాలనకు ఆకాశానికి పాతాళానికి ఉన్నంత తేడా ఉందని ఎద్దేవా చేసారు.వైఎస్సార్ మాట మీద నిలబడే నాయకుడు, మాట ఇస్తే నిలబెట్టే నాయకుడు.. జగన్ మాత్రం మాట తప్పే నాయకుడు అంటూ వైఎస్సార్ నాయకత్వాన్ని పొగడ్తలతో ముంచెత్తారు.
మద్యపాన నిషేదం చేసి ఓట్లు అడుగుతానన్న జగనన్న
ఇక..ఆంధ్రప్రదేశ్లో మధ్యపాన నిషేధం గురించి మాట్లాడుతూ.. మద్యపాన నిషేదం చేయక పోతే ఓట్లు అడగను అన్నాడు జగన్ ఆన్న, ఎన్నికలు వచ్చేనాటికి పూర్తిగా మద్యపాన నిషేదం చేసి ఓట్లు అడుగుతా అన్నాడు..మ్యానిఫెస్టో అంటే బైబిల్,ఖురాన్,భగవద్గీత లాంటిది అన్నారు జగన్ ఆన్న,ఇచ్చిన ప్రతి మాట తప్పిన జగన్ గారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలని జగన్ సర్కార్ను షర్మిల డిమాండ్ చేసారు.
మన్నవరం ప్రాజెక్ట్ పూర్తిగా అటకెక్కించిన మోడీ
YSR హయాంలో మన్నవరం ప్రాజెక్ట్ కట్టాలని అనుకున్నారు, అప్పటి ప్రధాని మన్మోహన్ తో వైఎస్సార్ శంకుస్థాపన కూడా చేయించారు..6 వేల కోట్లతో పూర్తి చేయాలని అనుకున్న ఎలక్ట్రికల్ పరికరాల తయారీ పరిశ్రమ ఇది..కాంగ్రెస్ హయాంలో అప్పుడు 100 కోట్లు కూడా కేటాయించింది. మోడీ అధికారంలో వచ్చాక… మన్నవరం ప్రాజెక్ట్ పూర్తిగా అటకెక్కిందంటూ బీజేపీ వైఖరి ఎండగట్టాలని కాంగ్రెస్ నేతలకు పిలుపునిచ్చారు. బీజేపీకి బానిసలు గా మారిన టిడిపి,వైసీపీ వైఖరిని ఎండగడదామని,ఈ రెండు పార్టీలను గెలిపిస్తే బీజేపీ కి వేసినట్లేనని,కాంగ్రెస్ గెలిస్తేనే విభజన హామీలు నెరవేరుతాయని ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
జనవరి 31న వైఎస్సార్ కడప జిల్లా సమావేశం
ఇక జనవరి 23న శ్రీకాకుళం జిల్లా ఇఛ్చాపురంలో శ్రీకాకుళం జిల్లా సమీక్షతో మొదలైన 9 జిల్లాల కాంగ్రెస్ విస్తృత స్తాయి సమావేశాలు జనవరి 31న వైఎస్సార్ కడప జిల్లాలో ముగుస్తాయి ఆ సమావేశాల ద్వారా జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ స్తితిగతులను అంచనా వేయడానికి వీలు కలుగుతుంది.