Complaint against Lawyer Sidharth Luthra: స్కిల్ డెవలెప్మెంట్ కేసులో అరెస్టైన టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) తరపున సుప్రీంకోర్టు సీనియర్ లాయర్ సిద్దార్థ్ లూథ్రా వాదనలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. న్యాయమూర్తి చంద్రబాబుకు రిమాండ్ విధించిన అనంతరం లూథ్రా న్యాయం జరగనప్పుడు కత్తి పట్టాల్సిందేంటూ ఆసక్తికర ట్వీట్ చేశారు. ఇప్పుడు ఈ ట్వీట్ హింసను ప్రేరేపించేలా ఉందని రాజమండ్రి మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ట్వీట్‌ను సుమోటోగా తీసుకుని లూథ్రాపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇప్పటికే లూథ్రా చేసిన ట్వీట్ హింసను రెచ్చగొట్టేలా ఉందని వైసీపీ నేతలు మండిపడ్డారు. బాబు అరెస్ట్, బెయిల్ మంజూరు కాకపోవడం లాంటి విషయాలు జీర్ణించుకోలేకనే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శిస్తున్నారు. ఇవి కచ్చితంగా కవ్వింపు చర్యల కిందకే వస్తుందని.. పరోక్షంగా అల్లర్లు చేయండి అని సందేశం ఇస్తున్నట్టు అనిపిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయపోరాటం కంటే ఆయుధ పోరాటమే మిన్న అన్న న్యాయవాది మాటలతో ఈ కేసు బలం అర్థమైందని మంత్రి అంబటి రాంబాబు (Ambati Rambabu) ట్వీట్ చేశారు.
న్యాయ పోరాటం కన్నా
ఆయుధ పోరాటమే మిన్న
అన్న న్యాయవాది మాటతో
కేసు బలం అర్థమయ్యింది !— Ambati Rambabu (@AmbatiRambabu) September 13, 2023
అసలు ఏం జరిగిందంటే.. అన్ని ప్రయత్నాలు చేసినా న్యాయం కనుచూపు మేరలో కనిపించనప్పుడు కత్తి పట్టడం సరైన చర్య అవుతుందంటూ సిద్ధార్ధ్ లూథ్రా రెండు రోజుల క్రితం ట్వీట్ చేశారు. పంజాబీల గురువు గురు గోబింద్ సింగ్ అప్పటి మొఘుల్ చక్రవర్తి ఔరంగజేబ్‌ను ఉద్దేశించి రాసిన జఫర్‌నామాలో ఈ మాటలున్నాయి. దీనికి సంబంధించి ఉర్దూలో గురుగోబింద్ సింగ్ ప్రస్తావించిన మాటల ఫొటోను ఆయన ట్యాగ్ చేశారు. ఏసీబీ కోర్టులో రిమాండ్ అవసరం లేదని లూథ్రా ఎంత వాదించినా న్యాయమూర్తి రిమాండ్ విధించిన నేపథ్యంలో లూథ్రా ఇలాంటి ట్వీట్ చేయడం చర్చనీయాంశంగా మారింది.
Motto for the day pic.twitter.com/gh0VsVYm8G
— Sidharth Luthra (@Luthra_Sidharth) September 13, 2023
ఇది కూడా చదవండి: చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా