Ambani’s pre-wedding Bash : అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ ప్రీవెడ్డింగ్ బాష్..ఈమధ్యే గుజరాత్ లోని జామ్ నగర్ లో ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ వేడుకకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎంతో మంది ప్రముఖులు, ఉన్నతస్థాయి వ్యక్తులు హాజరయ్యారు. దీంతో జామ్ నగర్ ప్రముఖుల రాకతో సందడిగా మారింది. ఫిబ్రవరి 24 నుంచి మార్చి 4 వరకు జామ్ నగర్ ఎయిర్ పోర్టు విమానాలతో కిక్కిరిసిపోయింది. ప్రముఖులు వచ్చిన విమానాలతో రద్దీగా మారింది. దీంతో ట్రాఫిక్ ను క్లియర్ చేసేందుకు భారత వైమానిక దళం రంగంలోకి దిగింది. ఐదు రోజులపాటు ఎలాంటి ఘటనలను జరగకుండా భారీ భద్రతా చర్యలు తీసుకుంది. ఫిబ్రవరి 24 నుంచి మార్చి 4వ తేదీ వరకు ఎయిర్ ఫీల్డ్ లో 24గంటల పాటు కార్యకలాపాల కోసం ఐఏఎఫ్ సహాయం కోసం రిలయన్స్ గ్రూప్ డిఫెన్స్ సెక్రటరీకి లేఖ రాసింది. జామ్ నగర్ వైమానిక స్థావరం రౌండ్-ది-క్లాక్ ఆపరేషన్ మోడ్‌లోకి వెళ్లిందని డిఫెన్స్ సెక్రటరీ చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్‌ను అభ్యర్థించినట్లు నివేదికలు పేర్కొన్నాయి. అయితే మొదట్లో ఐఏఎఫ్ కు 30 నుంచి 40 మాత్రమే ఎయిర్ క్రాఫ్టులు వస్తాయని లేఖలో పేర్కొన్నారు. కానీ 600లకు పైగా విమానాలు జామ్ నగర్ వచ్చినట్లు నివేదికలు చెబుతున్నాయి.
జామ్ నగర్ పరిమిత సౌకర్యాలు ఉండటం, ముందస్తు ప్రణాళిక, అదనపు మానవ వనరుల విస్తరణ వంటి సదుపాయాలు కల్పించారు. జామ్ నగర్ లో ఇంతకు ముందెన్నడూ లేని విధంగా విమానాలు వచ్చాయి. ఇలాంటి ట్రాఫిక్ ను ఎప్పుడూ చూడలేదని పలు రిపోర్టులు తెలిపాయి. జామ్‌నగర్ డ్యూయల్ యూజర్ ఎయిర్‌ఫీల్డ్, ఇక్కడ ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సమన్వయంతో పౌర విమానాల కదలికల కోసం ఎయిర్ ట్రాఫిక్ నిర్వహణకు బాధ్యత వహించింది. ప్రీమియర్ ఫైటర్ బేస్ కావడం వల్ల, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC) రోజూ అనేక షెడ్యూల్డ్, నాన్-షెడ్యూల్డ్ ఎయిర్ మూవ్మెంట్లను నిర్వహించింది. జామ్‌నగర్ విమానాశ్రయంలోని సివిల్ ఆప్రాన్ చాలా చిన్నది. చాలా తక్కువ సంఖ్యలో పౌర సిబ్బందితో పాటు ఎయిర్‌ఫీల్డ్‌లో ఒక మూలలో ఉన్న మూడు-నాలుగు విమానాలను మాత్రమే పార్కింగ్ చేయవచ్చు. జామ్‌నగర్ ఎయిర్ బేస్‌లో IAF మూడు ఫైటర్ స్క్వాడ్రన్లు రెండు హెలికాప్టర్ యూనిట్లు ఉన్నాయి.
రోడ్లు, ట్యాక్సీ ట్రాక్‌లు, రన్‌వేలను ఐఏఎఫ్ క్లియర్ చేసింది.వీఐపీలు వచ్చిన విమానాలు ల్యాండింగ్ అనంతరం తిరిగి వెళ్లాల్సిన అవసరం లేదు. కానీ ఎయిర్ పోర్టులో రద్దీని ద్రుష్టిలో ఉంచుకుని విమానాలను తిరిగి వెళ్లాల్సి వచ్చిందని అధికారులు తెలిపారు. పది పిట్ స్టాప్‌లను ఏర్పాటు చేశారు. అంటే 10 విమానాలు సమాంతర టాక్సీ ట్రాక్‌లపై ఒకే సమయంలో రిలయన్స్ ఏర్పాటు చేసిన వాహనాల్లోకి వెళ్లవచ్చు.ప్రీవెడ్డింగ్ కోసం ఐఏఎఫ్ రంగంలోకి దిగడం చరిత్రలో ఇదే మొదటిసారి. ఇక అప్ లోడింగ్ తర్వాత విమానాలు ముంబైకి తిరిగివెళ్లాల్సి వచ్చింది. ఏటీసీ కూడా ముంబై టై అప్ చేయాల్సి వచ్చింది. పెద్ద ఎయిర్ పోర్టులలో ఏటీసీలకు గ్రౌండ్ మూవ్ మెంట్ కోసం ప్రత్యేక కమ్యూనికేట్ ఛానెల్, అప్రోచ్ కోసం ప్రత్యేక ఛానెల్స్ ఉన్నాయి. జామ్ నగర్ ఏటీసీకి కేవలం ఛానెల్ మాత్రమే ఉంది. కాబట్టి జామ్ నగర్ కు కేవలం 60 నుంచి 80 విమానాలు మాత్రమే ల్యాండ్ అవుతాయి.
ఇది కూడా చదవండి: తెలంగాణలో లాసెట్ దరఖాస్తుల గడువు పొడిగింపు ..పరీక్ష తేదీ ఇదే.!