Anchor Rashmi : యాంకర్ రష్మీ(Anchor Rashmi) గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. జబర్దస్త్ షో(Jabardasth Show) తో ఫుల్ క్రేజ్ దక్కించుకున్న ఈ బ్యూటీ బుల్లితెర పై టాప్ యాంకర్స్ లో ఒకరిగా రాణిస్తోంది. ఇటు బుల్లితెర పై షోస్, ఈవెంట్స్.. వెండితెర పై సినిమాలు చేస్తూ అలరిస్తున్న ఈ అమ్మడు ప్రేక్షకులలో మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. ప్రస్తుతం రష్మీ(Rashmi) శ్రీదేవి డ్రామా కంపెనీ(Sridevi Drama Company), షోస్ చేస్తూ బిజీగా ఉంది. సోషల్ మీడియా(Social Media) లో కూడా సూపర్ యాక్టీవ్ గా కనిపించే రష్మీ అప్పుడప్పుడు తన ఫోటో షూట్స్, వీడియోస్ షేర్ చేస్తూ ఫ్యాన్స్ అలరిస్తుంటుంది.
Also Read : Samantha : ఫెమినా కవర్ పేజ్ కోసం.. సామ్ హాట్ ఫోటో షూట్
రష్మీ ఎమోషనల్ పోస్ట్
అయితే తాజాగా రష్మీ షేర్ చేసిన పోస్ట్ అందరినీ ఎమోషనల్ చేసింది. రష్మీకి జంతువులు అంటే చాలా ఇష్టం.. అంతే కాదు జంతు హింసను ఆమె అస్సలు సహించరు. అలాంటి సంఘటనలు జరిగినప్పుడు కూడా ఘాటుగా స్పందిస్తుంది. జంతువుల పట్ల విపరీతమైన ప్రేమను చూపించే రష్మీ.. తాజాగా తాను ఎంతో ప్రేమగా పెంచుకుంటున్న పెంపుడు కుక్కను కోల్పోయింది. దీంతో ఈ విషయాన్నీ తెలియజేస్తూ ఇన్స్టాగ్రామ్ వేదికగా ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది. “నా సాసీ ప్రిన్సెస్ బంగారంతో గడిపిన చివరి 24 గంటల జ్ఞాపకాలు. లవ్ యు మై బేబీ గర్ల్. అంటిల్ నెక్స్ట్ టైం .. చుట్కీ గౌతమ్(Chutki Gautam) (కుక్క) సైనింగ్ ఆఫ్” అంటూ తన కుక్క మరణించినట్లు పోస్ట్ షేర్ చేసింది. అలాగే తన కుక్కతో కలిసి ఉన్న కొన్ని ఫొటోలను షేర్ చేస్తూ ఎమోషనల్ అయ్యింది. జంతువుల ప్రాణానికి ఎంతో విలువను ఇచ్చే రష్మీ.. తన కుక్క (చుట్కీ) చితాభష్మాన్ని తనతో పాటు ఇంటికి తెచ్చుకుంది. దీనికి సంబందించిన ఫోటోను కూడా షేర్ చేసింది. ప్రస్తుతం ఈమె పోస్ట్ నెట్టింట్లో వైరల్ గా మారింది.