TS News : ప్రముఖ విద్యావేత్త, వయో వృద్దులు చుక్కా రామయ్య(Chukka Ramaiah)ను పరామర్శించారు తెలంగాణ రాష్ట్ర పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖా మంత్రి సీతక్క(Sitakka). చుక్కా రామయ్య ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. హైదరాబాద్ లోని ఆయన నివాసానికి వెళ్లిన మంత్రి సీతక్క…ఆరోగ్య వివరాలను అడిగి తెలుసుకున్నారు. గత కొన్నాళ్లుగా చుక్కా రామయ్య అనారోగ్యంతో బాధపడుతున్నారు.
ఇది కూడా చదవండి: అందరికీ డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ కార్డు…సీఎం రేవంత్ కీలక ఆదేశాలు..!!
కాగా మొన్న తెలంగాణ రాష్ట్ర శాసనమండలి సభ్యుడిగా నియామకమయిన సందర్భంగా ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్యను కోదండరాం(Kodandaram) కలిశారు. చుక్కా రామయ్య నుంచి ప్రొఫెసర్ కోదండరాం ఆశీస్సులు తీసుకున్నారు.