చియాన్ విక్రమ్ నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ సినిమా తంగలాన్. ఈ చిత్రాన్ని ప్రముఖ డైరెక్టర్ పా రంజిత్ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ , జియో స్టూడియోస్ బ్యానర్స్ పై ప్రొడ్యూసర్ కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. బుధవారం చియాన్ విక్రమ్ పుట్టినరోజు #HappyBirthdayChiyaanVikram సందర్భంగా ఆయనకు బర్త్ డే విషెస్ చెబుతూ “తంగలాన్” మూవీ నుంచి స్పెషల్ గ్లింప్స్ విడుదల చేశారు.
ఈ సినిమా కోసం విక్రమ్ ఎంతగా కష్టపడ్డాడో ఈ గ్లింప్స్ చూస్తే తెలుస్తుంది. కథకు తగ్గట్లుగా చియాన్ మారిపోవడం ఇదేమీ మొదటి సారి కాదు.. శివపుత్రుడు, అపరిచితుడు, ఐ సినిమాల్లో విక్రమ్ అదిరిపోయే యాక్షన్ తో అందర్ని ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో విక్రమ్ ఎలా తన నటన, స్క్రీన్ ప్రెజెన్స్ తో ఎలా మెస్మరైజ్ చేయబోతున్నాడో ఈ గ్లింప్స్ తో తెలుస్తుంది.
“తంగలాన్” సినిమా కోసం విక్రమ్ తనని తాను ఎంతలా మార్చుకున్నారో ఈ గ్లింప్స్ వీడియోలో తెలుస్తుంది. ఈ గ్లింప్స్ విడుదల సందర్భంగా దర్శకుడు పా. రంజిత్ మాట్లాడుతూ.. “తంగలాన్” సినిమాను చరిత్రలో జరిగిన కొన్ని యదార్థ ఘటనల నేపథ్యంతో తెరకెక్కిస్తున్నట్లు వివరించారు.
ప్రముఖ ప్రొడక్షన్ కంపెనీ జియో స్టూడియోస్ “తంగలాన్” సినిమా కోసం స్టూడియో గ్రీన్ తో చేతులు కలపడం సంతోషంగా ఉంది. జియో స్టూడియోస్ రాకతో మా సినిమా గ్లోబల్ ఆడియెన్స్ కు మరింతగా దగ్గర అవుతుందని ఆశిస్తున్నాం అన్నారు. హీరో విక్రమ్ “తంగలాన్” సినిమా కోసం ఎంతగా కష్టపడ్డారో ఈ గ్లింప్స్ నే చెబుతుందన్నారు.
తంగలాన్” సినిమాలో పార్వతీ తిరువోతు మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ నేపథ్యంలో యదార్థ ఘటనల ఆధారంగా ఈ సినిమా రూపొందింది.
Also read: ఎన్నికల సమయంలో హాట్ టాపిక్ గా రేణు దేశాయ్ పోస్ట్.. దీనికి అర్థం ఏంటి?