Chiranjeevi – venkatesh : విక్టరీ వెంకటేష్ సినిమాల జోరు పెంచినట్లే అనిపిస్తోంది. ఆ మధ్య సినిమాలు తగ్గించి కాస్త గ్యాప్ తీసుకున్న వెంకటేష్ ఇప్పుడు వరుస సినిమాలు చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు. ఈ క్రమంలో మెగా స్టార్ తో ఓ మల్టీ స్టారర్ మూవీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. రీసెంట్ గా వెంకీ 75 ఈవెంట్ గ్రాండ్ గా నిర్వహించిన సంగతి తలిసిందే. ఈ వేడుకకు మెగా స్టార్ చిరంజీవి మరియు చాలా మంది సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఇక్కడ చిరు సెంట్రాఫ్ ఎట్రాక్షన్ గా నిలవడం జరిగింది. మెగా స్టార్ కహిదీ నమబ్ర 150 తో కంబ్యాక్ కాకపోయి ఉంటె ఈ పాటికి ఏ హిమాలయాలకో వెళిపోయేవాడినని .. ఒక విధంగా చెప్పాలంటే నాకు చిరంజీవి ఇన్స్పిరేషన్ అని అనడం జరిగింది.
మల్టీస్టారర్ చిత్రాల బ్రాండ్ అంబాసిడర్ వెంకీ
వెంకటేష్ మల్టి స్టారర్ చిత్రాలకు పెట్టింది పేరు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు లో సూపర్ స్టార్ మహేష్ బాబుతో స్క్రీన్ షేర్ చేసుకుని బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఇక.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో గోపాల గోపాల చిత్రంలో స్క్రీన్ షేర్ చేస్కుని శభాష్ అనిపించుకున్నారు. ఇక.. మేనల్లుడు నాగ చైతన్య తో వెంకీ మామ సినిమా లో నటించి ఔరా అనిపించుకున్నారు. కథ డిమాండ్ చేస్తే ఏ స్టార్ హీరోతో అయినా స్క్రీన్ షేర్ చేసుకోవడానికైనా సై అంటున్నారు వెంకీ. ఈ క్రమంలోనే నేచురల్ స్టార్ నానితో సైతం త్వరలో ఓ మూవీ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక ..అసలు విషయానికి వస్తే .. మెగా స్టార్ చిరంజీవితో కలిసి నటించాలని ఉందని తన అబిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సాధారణంగా ఇలాంటి స్టేట్మెంట్స్ ఈవెంట్స్ లో మిస్తూ ఉంటారు . కానీ .. వెంకీ మాత్రం మచ్చలా సీరియస్ గానే తన ఒపీనియన్ వ్యక్తం చేశారు.
సైంధవ్ ప్రెస్ మీట్ లో గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వెంకి
చిరు – వెంకీ మల్టి స్టారర్ విషయంపై ‘సైంధవ్’ ప్రెస్ మీట్ లో క్లారిటీ ఇచ్చారు వెంకీ. చిరంజీవితో తనకు సినిమా చేయాలని ఉందని, దర్శకులు, రచయితల కథలు తీసుకొస్తే మేం సిద్ధం అని అన్నారు వెంకటేష్.ఇక.. మెగా స్టార్ సైతం మల్టీస్టారర్ చిత్రాల వైపు మొగ్గు చూపిస్తున్నారు.మొన్న రిలీజయన వాల్తేరు వీరయ్య మించిన మాల్ట్ స్టారర్ ఉంటుందా. రవితేజతో చిరు కలిసి చేసిన సందడి ఇంకా ఎవ్వరు మరచిపోలేదు. ,అలాగే ఆచార్య మూవీ సైతం రామ్ చరణ్‌తో స్క్రీన్ షేర్ చేసుకున్నారు చిరు. సో.. వెంకటేష్ ఇచ్చిన బంపర్ ఆఫర్ ఏ దర్శకుడిని వరిస్తుందో చూడాలి.
ALSO:Saindhav Trailer Review : సీట్ ఎడ్జ్ యాక్షన్ థ్రిల్లర్ ..సైంధవ్ మూవీ థియేట్రికల్ ట్రైలర్