Surekha Konidela: నేడు పద్మ విభూషణ్ మెగాస్టార్ చిరంజీవి సతీమణీ సురేఖ పుట్టిరోజు. ఈ సందర్భంగా చిరంజీవి, కుటుంబ సభ్యులు, పలువురు సినీ ప్రముఖులు కూడా ఆమెకు విషెష్ తెలియజేస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా మెగా కోడలు ఉపాసన కొణిదెల.. అత్తయ్య పుట్టినరోజు సందర్భంగా ఒక స్పెషల్ న్యూస్ షేర్ చేసుకున్నారు.
ఫుడ్ బిజినెస్ లోకి మెగాస్టార్ సతీమణి సురేఖ
సోషల్ మీడియా ద్వారా అత్తయ్యకు బర్త్ తెలియజేసిన ఉపాసన.. ‘అత్తమ్మాస్ కిచెన్’ పేరుతో సురేఖ ఆన్లైన్ ఫుడ్ బిజినెస్‌లోకి ఎంట్రీ ఇస్తున్నట్లు ప్రకటించింది. పుట్టినరోజు సందర్భంగా ఫుడ్ బిజినెస్ కు సంబంధించిన వీడియోను షేర్ చేసింది. “అత్తయ్య పుట్టినరోజు సందర్భంగా ఈ కొత్త వెంచర్‌ను(Athamma’s Kitchen ) ప్రారంభించడం ఆనందంగా ఉంది. మా వంట గది నుంచి మీ ఇంటికి వస్తున్న.. ఈ రెడీ మిక్స్ మిశ్రమాలను మీరు కూడా ఆస్వాదించండి అంటూ ఉపాసన రాసుకొచ్చారు. athammaskitchen.com వెబ్ సైట్ లో ఈ రెడీ మిక్స్ ఫుడ్ ప్రాడక్ట్స్ అందుబాటులో ఉండబోతున్నట్లు ఆమె తెలిపింది.
Sharmila Son Haldi Photos : షర్మిల కుమారుడు రాజారెడ్డి హల్దీ వేడుకలు.. వైరలవుతున్న ఫొటోలు
View this post on Instagram
‘అత్తమ్మాస్ కిచెన్’ స్టోరీ
మెగాస్టార్ చిరంజీవి సంవత్సరంలో 200 రోజులు షూటింగ్స్ లోనే గడిపే సమయంలో.. ఆయన కోసం సురేఖ ఇంట్లో వండిన ఆహారాన్ని ప్యాక్ చేసేవారట. దీంతో చిరంజీవికి హోమ్ ఫుడ్ మిస్ అయిన ఫీలింగ్ ఉండేది కాదట. ఈ సమయంలో ప్రజలకు ఇంటి ఆహారంతో ఉన్నగాఢమైన అనుబంధాన్ని గమనించారు సురేఖ. ఈ ఆలోచన నుంచి వచ్చిన ఐడియానే athammaskitchen.com. ‘అత్తమ్మాస్ కిచెన్’ కిచెన్ లో సంప్రదాయ వంటకాలు ప్రత్యేకంగా ఉంటాయి. ముఖ్యంగా ఇంటికి దూరంగా ఉన్నవారికి లేదా కొన్ని మైళ్ళ దూరం ప్రయాణం చేసే వారు.. ఇంటి భోజనం మిస్ అవ్వకుండా.. రెడీ మిక్స్ రూపంలో టేస్టీ, సంప్రదాయ వంటకాలను అందించడమే ‘అత్తమ్మాస్ కిచెన్’ కాన్సెప్ట్.
Also Read : Megastar Chiranjeevi: ”నా జీవన రేఖ.. నా సౌభాగ్య రేఖ”.. భార్యకు మెగాస్టార్ స్పెషల్ విషెష్