Chiranjeevi: టాలీవుడ్ మెగాస్టార్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన ఆల్ టైం సూపర్ హిట్ ‘ఇంద్ర’ మూవీని నిన్న రిలీజ్ చేశారు. దీంతో థియేటర్లలో ఫ్యాన్స్ హంగామా మామూలుగా లేదు. వింటేజ్ మెగాస్టార్ ను స్క్రీన్స్ పై మరోసారి చూస్తూ థియేటర్లలో రచ్చ చేశారు. ముఖ్యంగా హైదరాబాద్ సిటీలో ‘ఇంద్ర’ మేనియా మామూలుగా లేదు. హోదాతో సంబంధం లేకుండా ఎమ్మెల్యేలు కూడా తమ అభిమాన హీరోను స్క్రీన్ పై చూస్తూ తెగ ఎంజాయ్ చేశారు. దీంతో అప్పటికీ, ఇప్పటికీ చిరు క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదని మరోసారి రుజువైంది.
‘చిరు’ సత్కారం!
మెగాస్టార్ కెరీర్ లో అతి పెద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఇంద్ర 22 ఏళ్ళ తర్వాత మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా చిరంజీవి ‘ఇంద్ర’ కోసం పనిచేసిన చిత్రబృందాని స్వయంగా ఇంటికి ఆహ్వానించి సత్కరించారు. ఈ విషయాన్ని మెగాస్టార్ సోషల్ మీడియా వేదికగా తెలిపారు. ప్రొడ్యూసర్ అశ్విని దత్, దర్శకుడు జీ. గోపాల్, మరుపురాని డైలాగ్స్ అందించిన పరుచూరి బ్రదర్స్, కధనందించిన చిన్ని కృష్ణ, సంగీత దర్శకుడు మణిశర్మకు సత్కారం చేశారు. అలాగే చిత్రబృందానికి కృతజ్ఞతలు తెలిపారు. ఇందుకు సంబంధించిన ఫొటోను కూడా ట్విట్టర్ లో షేర్ చేశారు చిరు.
‘ఇంద్ర’ క్రియేట్ చేసిన సునామీ గుర్తు చేస్తూ
22 సంవత్సరాల తర్వాత మరోసారి థియేటర్స్ లో రిలీజ్ అయిన సందర్భంగా, ‘ఇంద్ర’ టీంకి ‘చిరు’ సత్కారం!
అలాగే ప్రొడ్యూసర్ @AshwiniduttCh గారు, డైరెక్టర్ B.Gopal, మరపురాని డైలాగ్స్ ని అందించిన #ParuchuriBrothers , కధనందించిన చిన్ని క్రిష్ణ,… pic.twitter.com/UfGpOd2gkE— Chiranjeevi Konidela (@KChiruTweets) August 23, 2024
Also Read: Raviteja: హీరో రవితేజకు గాయాలు.. ఆరు వారాలపాటు విశ్రాంతి..! – Rtvlive.com