Chiranjeevi: ఈ మధ్య కాలంలో తెలుగు ఇండస్ట్రీ లో రీ రిలీజ్ ట్రెండ్ బాగా నడుస్తున్న విషయం తెలిసిందే. ఒకప్పుడు హిట్ అయిన పాత సినిమాలను మేకర్స్ మళ్ళీ రీ రిలీజ్ చేస్తున్నారు. అభిమానులు నుంచి కూడా వీటికి మంచి స్పందన రావడంతో భారీ కలెక్షన్స్ సొంతం చేసుకుంటున్నాయి. ఈ రీ రిలీజ్ ట్రెండ్ నేటి యువతను బాగా ఆకట్టుకుందనే చెప్పొచ్చు.
మహేష్ బాబు పోకిరి సినిమాతో మొదలైన ఈ రీ రిలీజ్ ట్రెండ్ ఇంకా కొనసాగుతూనే ఉంది. పోకిరి తర్వాత ‘ఆరెంజ్’, ‘యోగి’, ‘ఒక్కడు’, ‘7జి బృందావన్ కాలనీ’, ఇలా చాలా సినిమాలను మళ్ళీ రిలీజ్ అయ్యి భారీ కలెక్షన్స్ సొంతం చేసుకున్నాయి. ఒకప్పుడు బాక్స్ ఆఫీస్ వద్ద ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న సినిమాలు కూడా రీ రిలీజ్ అయ్యి రికార్డులు క్రియేట్ చేస్తున్నాయి. ప్రస్తుతం ఇండస్ట్రీ లో రీ రిలీజ్ హంగామా బాగా నడుస్తుంది.
Also Read: Allu Arjun – అసలు సినిమాలోకి ఎంట్రీ ఇవ్వడానికి కారణం ఇదే..!!
ఇప్పటికే చాలా సినిమాలు రీ రిలీజ్ అయ్యి మంచి రెస్పాన్స్ సొంతం చేసుకోగా మరి కొన్ని సూపర్ హిట్ సినిమాలు కూడా రీ రిలీజ్ కు సిద్ధమవుతున్నాయి. అందులో ఒకటి మెగాస్టార్ ‘శంకర్ దాదా M.B.B.S’.
మెగాస్టార్ నటించిన ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో ‘శంకర్ దాదా M.B.B.S’. ఒకటి. మేకర్స్ ఈ సినిమాను నవంబర్ 4 న రీ రిలీజ్ కు సిద్దమైనట్లు తెలిసింది. 2004 రిలీజైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల మోత మోగించింది. ఈ సినిమాను హిందీలో వచ్చిన ‘మున్నా భాయ్ M.B.B.S’. కు రీమేక్ గా జయంత్ సి తెరకెక్కించారు. ఈ సినిమా థియేటర్స్ లో 100 రోజులు ఆడి బాక్స్ ఆఫీస్ హిట్ గా నిలిచింది.
ఈ సినిమాలో చిరంజీవి, శ్రీకాంత్ మధ్య ఉండే కామెడీ సన్నివేశాలు, చిరంజీవి మాట్లాడే ఇంగ్లీష్ డైలాగ్స్ కు అభిమానులను బాగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమా రీ రిలీజ్ అనగానే మెగా ఫ్యాన్స్ కు పండగే. మెగా అభిమానులు ఈ సినిమా రీ రిలీజ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.