Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి తన తల్లి అంజనా దేవి జన్మదిన వేడుకలను నిర్వహించారు. తన భార్య సురేఖతో కలిసి ఇంట్లో కేక్ కట్ చేయించారు. ఈ మేరకు ఫొటోలను Xలో పంచుకున్నారు.
‘కనిపించే దేవత, కని పెంచిన అమ్మకి ప్రేమతో జన్మదిన శుభాకాంక్షలు’ అని ట్వీట్ చేశారు.
చిరంజీవి సోదరితో పాటు సతీమణి సురేఖ ఈ వేడుకల్లో భాగమయ్యారు. ఈ ఫొటోలను చూసిన మెగా అభిమానులు తెగ సంబురపడిపోతున్నారు.
ఇక సినీ ప్రముఖులతో పాటు అభిమానులు, నెటిజన్లు చిరంజీవి తల్లి అంజనా దేవికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. కాగా ఎప్పుడు తన తల్లిపై ప్రేమ, అప్యాయతను చిరంజీవి కురిపిస్తుంటాడు. ప్రతి సంవత్సరం ఆమె పుట్టినరోజును ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటుంది మెగా ఫ్యామిలీ. చిరంజీవి, నాగబాబు, పవన్ కల్యాణ్, వారి సోదరీమణులు, మనవళ్లు, మనవరాళ్లతో ఘనంగా నిర్వహిస్తుంటారు.
ఇది కూడా చదవండి: స్టేట్ బ్యాంక్ ఖాతాదారులకు అలర్ట్.. మరి కొద్ది సేపట్లో ఆ సేవలు బంద్..!!