Quake on Moon: భూమిపై సంభవించే ప్రకంపనల లాగానే చంద్రుడిపై కూడా ప్రకంపనలు కలుగుతాయా? జాబిల్లిపై రహస్యాలను ఛేదిస్తోన్న చంద్రయాన్-3 పరిశోధనలో ఇది తేలిందా? అంటే అవుననే అంటోంది ఇస్రో. జాబిల్లిపై ప్రకంపనలు గుర్తించినట్టు ప్రకటించింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చంద్రయాన్-3 మూన్ మిషన్ నిర్వహించిన మరో ఇన్-సిటు శాస్త్రీయ ప్రయోగం ఫలితాలను ప్రకటించింది. ఇక్కడ లూనార్ సీస్మిక్ యాక్టివిటీ (ILSA) పేలోడ్ ఒక ఘటనను రికార్డ్ చేసింది. “సహజంగా కనిపిస్తుంది”. ఈ ఘటనపై మరింత లోతుగా పరిశోధన చేస్తున్నామని భారత అంతరిక్ష సంస్థ తెలిపింది.
Chandrayaan-3 Mission:
In-situ Scientific ExperimentsRadio Anatomy of Moon Bound Hypersensitive Ionosphere and Atmosphere – Langmuir Probe (RAMBHA-LP) payload onboard Chandrayaan-3 Lander has made first-ever measurements of the near-surface Lunar plasma environment over the… pic.twitter.com/n8ifIEr83h
— ISRO (@isro) August 31, 2023
“చంద్రయాన్-3 మిషన్: ఇన్-సిటు సైంటిఫిక్ ప్రయోగాలు – చంద్రయాన్ 3 ల్యాండర్‌పై లూనార్ సీస్మిక్ యాక్టివిటీ (ILSA) పేలోడ్ కోసం పరికరం – చంద్రునిపై మొట్టమొదటి మైక్రో ఎలక్ట్రో మెకానికల్ సిస్టమ్స్ (MEMS) టెక్నాలజీ ఆధారిత పరికరం – రోవర్ కదలికలను రికార్డ్ చేసింది. ఇతర పేలోడ్లు. అంతేకాకుండా ఇది ఆగస్టు 26, 2023న సహజంగా జరిగే ఈవెంట్‌ను రికార్డ్ చేసింది. ఈ ఈవెంట్‌పై పరిశోధన జరుగుతోంది” అని ఇస్రో(ISRO) ట్విట్టర్లో పోస్ట్ చేసింది.
Chandrayaan-3 Mission:
In-situ Scientific ExperimentsInstrument for the Lunar Seismic Activity (ILSA) payload on Chandrayaan 3 Lander
— the first Micro Electro Mechanical Systems (MEMS) technology-based instrument on the moon —
has recorded the movements of Rover and other… pic.twitter.com/Sjd5K14hPl— ISRO (@isro) August 31, 2023
ఎలా రికార్డ్ చేసింది:
నిజానికి చంద్రయాన్-3లోని విక్రమ్ ల్యాండర్లో ప్రకంపనలు రికార్డ్ చేసే పరికరాలున్నాయి. ప్రజ్ఞాన్ రోవర్‌తో పాటు ఇతర పేలోడ్ల ఆధారంగా జాబిల్లిపై ప్రకంపనలు గుర్తించినట్టు ఇస్రో చెబుతోంది. అంటే భూమిపై సహజంగా ఎలాగైతే ప్రకంపనలు వస్తాయో.. అలానే నేచురల్‌గా మూన్‌క్వేక్(Moon Quake)ని గుర్తించారు. దీనిపై మరింత లోతుగా అధ్యయనం చేసిన తర్వాత మరిన్ని వివరాలు తెలుస్తాయి. ఆగస్టు 23 సాయంత్రం 6 గంటల 4నిమిషాలకు జాబిల్లి దక్షిణ ధృవంపై అడుగుపెట్టిన చంద్రయాన్-3 మునుపెన్నడూ తెలియని జాబిల్లి విషయాలను ప్రపంచంతో పంచుకుంటోంది. ఇది ఇతర దేశాల సైంటిస్టులను కూడా ఆనందపెడుతోంది. సైన్స్ ముందుగుడు వేస్తుంటే ఎవరైనా చప్పట్లతో అభినందించాల్సిందే కదా!
లూనార్ సీస్మిక్ యాక్టివిటీతో ఇది సాధ్యం:
విక్రమ్ ల్యాండర్-లూనార్ సీస్మిక్ యాక్టివిటీ(ILSA) ఆరు హై-సెన్సిటివిటీ యాక్సిలెరోమీటర్ల క్లస్టర్‌ను కలిగి ఉంది. ఇవి సిలికాన్ మైక్రోమ్యాచినింగ్ ప్రక్రియను ఉపయోగించి దేశీయంగా తయారు చేశారు. కోర్ సెన్సింగ్ మూలకం ఎలక్ట్రోడ్లతో కూడిన స్ప్రింగ్-మాస్ సిస్టమ్‌ను కలిగి ఉంటుంది. ఈ స్ప్రింగ్ విక్షేపణకు దారితీస్తాయి, ఫలితంగా కెపాసిటెన్స్లో మార్పు వస్తుంది.. ఇది వోల్టేజ్‌గా మారుతుంది. చంద్రయాన్-3 మిషన్ సమయంలో సహజ ప్రకంపనలు, ప్రభావాలు, కృత్రిమ ఘటనల ద్వారా ఉత్పన్నమయ్యే ప్రకంపనలను కొలవడం ILSA ప్రాథమిక లక్ష్యం . ఆగస్ట్ 25న రోవర్ నావిగేషన్ సమయంలో రికార్డయిన వైబ్రేషన్లను ఇస్రో షేర్ చేయగా.. ఆగస్ట్ 26న రికార్డయిన ప్రకంపనల వివరాలను కూడా పోస్ట్ చేసింది.
ALSO READ: చందమామ పెరట్లో పసిపాప(రోవర్) పరుగులు.. క్యాప్చర్ చేసిన తల్లి.. వైరల్ వీడియో!