టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోగ్యంపై ఆయన సతీమణి భువనేశ్వరి, నారా లోకేశ్ సంచలన ప్రకటనలు చేశారు. చంద్రబాబు ఆరోగ్యం ప్రమాదంలో ఉందన్నారు. బాబుకు స్టెరాయిడ్స్ ఇచ్చే కుట్ర జరుగుతుందని ఆరోపించారు. చంద్రబాబుకు అత్యవసర వైద్యం అందించడంలో ప్రభుత్వం విఫలమైందంటూ భువనేశ్వరి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే చంద్రబాబు 5 కిలోల బరువు తగ్గారని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఇంకా బరువు తగ్గుతే కిడ్నీలపై ప్రభావం చూపుతుందని వైద్యులు హెచ్చరించారని భువనేశ్వరి తెలిపారు. అంతేకాదు జైలులో సౌకర్యాలు సరిగ్గా లేవని..ఓవర్ హెడ్ నీళ్ల ట్యాంకులు అపరిశుభ్రంగా ఉన్నాయని ఆరోపించారు. చంద్రబాబు ఆరోగ్యానికి తీవ్ర ముప్పు వాటిల్లుతోందని…జైల్లోని పరిస్థితులు తన భర్తకు తీవ్రముప్పు తలపెట్టేలా ఉన్నాయంటూ భువనేశ్వరి ఆవేదన వ్యక్తం చేశారు.
ఇది కూడా చదవండి: అంగళ్ళు కేసులో చంద్రబాబునాయుడు బిగ్ రిలీఫ్
I am deeply concerned for my husband’s well-being, as the Govt of Andhra Pradesh has failed to provide him with the timely medical care he urgently needs while he remains in prison. He has already lost 5 kg weight, and any further weight loss could have severe consequences for…
— Nara Bhuvaneswari (@ManagingTrustee) October 13, 2023
There is an undeniable and immediate threat to CBN’s life. He is being deliberately harmed. His safety is unquestionably at risk.
CBN is facing a dire situation, dealing with mosquitoes, contaminated water, weight loss, infections, and allergies, all without access to timely…
— Lokesh Nara (@naralokesh) October 13, 2023
Heartbreaking. @ncbn garu is currently detained in inadequate and unsanitary prison conditions that pose a considerable risk to his health. Urgent medical attention is required, as medical professionals have raised concerns about his well-being. Timely medical care is not being…
— Brahmani Nara (@brahmaninara) October 13, 2023
ఇది కూడా చదవండి: మూడు కోర్టుల్లో చంద్రబాబు కేసుల మీద నేడు విచారణ.. టీడీపీ శ్రేణుల్లో ఉత్కంఠ
అటు జైల్లో చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి బాగాలేదన్న వార్తల నేపథ్యంలో టీడీపీ నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం 11 గంటలకు టీడీపీ ముఖ్య నేతలు అత్యవసరంగా భేటీ కావాలని నిర్ణయించారు. మంగళగిరి సెంట్రల్ ఆఫీస్ లో సమావేశమై.. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి, కేసుల విషయంపై చర్చించనున్నారు. కోర్టుల్లో జరుగుతున్న పరిణామాలపై టీడీపీ నేతలు సమీక్ష నిర్వహించనున్నారు. భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకోనున్నారు.