Pradhan Mantri Matritva Vandana Yojana Scheme: కేంద్ర ప్రభుత్వం గర్భిణీలకు మంచి ఆర్థిక సాయాన్ని అందిస్తున్నది. తొలి కాన్పుకు 5 వేలు, రెండవ కాన్పుకు 6 వేలు చొప్పున గడిచిన ఎనిమిది ఏళ్లుగా అందిస్తున్నది. ఈ స్కీంల గురించి తెలియకుండా కొంత మంది ప్రైవేటు వైద్యం తీసుకొంటున్నారు. గర్భం దాల్చిన నాటి నుండి ఆరోగ్య సిబ్బంది వారు పూర్తి వివరాలు పొందు పరిచి, తొమ్మదవ నెల వరకు అన్ని చికిత్సలు అందించే కార్యక్రమం బాధ్యత వహిస్తున్న ఆశ వర్కర్లు, ఏఎన్ ఎం సిబ్బంది తీసుకొంటున్నారు.ఈ స్కీం మీకు వర్తించాలి అంటే ఎలా దరఖాస్తు చేసుకోవాలి. గర్భం దాల్చే మహిళలకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని అందిస్తోంది. తొలి కాన్పుకు అయితే రూ.5000, రెండో కాన్పుకు అయితే రూ.6000చొప్పున ఆర్థిక సహాయాన్ని కేంద్ర ప్రభుత్వం గడిచిన ఎనిమిదేళ్లుగా అందిస్తోంది. ఈ పథకం పేరు ప్రధాన మంత్రి మాతృత్వ వందన యోజన (PMMVY). ఈ పథకంలో భాగంగా తొలిసారి గర్భం దాల్చే మహిళలకు ఐదు వేలు, రెండోసారి ప్రసవంలో ఆడ పిల్ల పుడితే ఆరు వేలు రూపాయలు సాయాన్ని అందిస్తున్నారు. ఈ పథకంలో భాగంగా ఎవరు లబ్ధి పొందవచ్చు, ఎలా దరఖాస్తు చేయాలి? వంటి అంశాలు తెలుసుకోెండి!
Also Read: సోషల్ మీడియాలోనూ పోటీలు పడుతున్న పార్టీలు..టాప్‌లో బీజేపీ
ప్రధాన మంత్రి మాతృత్వ వందన యోజన:
గర్భం దాల్చిన మహిళలకు పోషకాలతో కూడిన ఆహారాన్ని తీసుకునేలా చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి మాతృత్వ వందన యోజన పేరుతో ఒక పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకంలో భాగంగా గర్బం దాల్చిన వెంటనే మహిళలు తమ పరిధిలోని ఆశా వర్కర్/ఏఎన్ఎం ద్వారా ఈ స్కీమ్‌కు సంబంధించిన పోర్టల్‌లో పేరు నమోదు చేయించుకోవాల్సి ఉంటుంది. తొలిసారి గర్భం దాల్చినట్టు అయితే ఐదు వేలు అందిస్తారు. ఈ పోర్టల్ పేరు నమోదు చేసుకున్న వారికి తొలి విడతలో గర్భం దాల్చిన ఆరు నెలల్లో మూడు వేల రూపాయలు నేరుగా లబ్ధిదారు అకౌంట్లో జమ అవుతుంది.
రెండో విడతలో డెలివరీ తరువాత 14 వారాల వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి చేసుకుంటే మిగిలిన రెండు వేలు రూపాయలు అకౌంట్లో జమ చేస్తారు. ఈ పథకంలో భాగంగా అందించే ఆర్థిక సాయాన్ని ఏడాది కిందట వరకు మూడు విడతల్లో చెల్లించేవారు. కానీ, గతేడాది నుంచి రెండు విడతలకు కుదించారు. ప్రస్తుతం రెండు విడతల్లో తొలి గర్భం దాల్చిన లబ్ధిదారులకు నేరుగా అకౌంట్‌కు జమ చేస్తున్నారు.రెండోసారి అమ్మాయి పుడితే ఆరు వేలు. ఈ పథకంలో భాగంగా మూడేళ్ల కిందటి వరకు తొలి ప్రసవానికి మాత్రమే ఐదు వేలు అందించేవారు. కానీ, మూడేళ్ల నుంచి రెండోసారి గర్భం దాల్చిన బాలికనుప్రసవించే మహిళలకు ఆరు వేలు చొప్పున ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నారు. రెండోసారి బాలికకు జన్మనిస్తే వారు ఏఎన్ఎం/ఆశా ద్వారా మరోసారి పీఎంఎంవీవైఎంఐఎస్( PMMVY MIS ) పోర్టల్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 14 వారాల వ్యాక్సినేషన్ పూర్తయిన తరువాత ఆరు వేలు ఒకేసారి లబ్ధిదారు అకౌంట్లో జమ చేస్తారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో ఎక్కడ ప్రసవం జరిగినా ఈ సహాయాన్ని అందించనున్నారు. ఇందుకోసం లబ్ధిదారులు చేయాల్సిందంతా రిజిస్ర్టేషన్ చేసుకోవడమే.