Ambani Wedding: రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ వివాహ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. జులై 12న అనంత్ తన చిన్ననాటి స్నేహితురాలు రాధికా మూడు ముళ్ళ బంధంతో ఒకటయ్యారు. అనంత్ రాధికా వివాహానికి ప్రపంచ నలుమూలల నుంచి , ప్రముఖులు, వ్యాపార వేత్తలు, దేశాధినేతలు, సినీ తారలు హాజరయ్యారు.
అంబానీ పెళ్ళిలో డాన్సులతో సినీ తారల సందడి
అనంత్- రాధికా పెళ్లి వేడుకల్లో టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ సినీ తారలు, స్టార్ క్రికెటర్లు సందడి చేశారు. అనంత్ పెళ్లి భరాత్ లో సినీ తారలు జోరుగా డ్యాన్స్ వేస్తూ వేదికను సందడిగా మార్చారు. బాలీవుడ్ స్టార్స్ షారుఖ్ ఖాన్, ప్రియాంక చోప్రా, అనన్య, రణ్ వీర్ సింగ్, రణ్ బీర్ కపూర్, విక్కీ కౌశల్, ఆలియా టాలీవుడ్ స్టార్ మహేష్, రామ్ చరణ్, నమ్రత.. స్టార్ క్రికెటర్స్ ధోనీ, హార్దిక్, డ్యాన్స్ చేశారు. విక్కీ కౌశల్ తన హిట్ పాట ‘తౌబా తౌబా’ పాటకు స్టెప్పులేశారు. సెలెబ్రిటీల, డాన్సులు, సందడితో అనంత్- రాధికా పెళ్లి వేడుక కోలాహలంగా మారింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.