Job Mela in Telangana: నిరుద్యోగులకు శుభవార్త. అక్టోబర్ 9న మహబూబాబాద్ (Mahbubabad) లోని న్యూ ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ లో మెగా జాబ్ మేళాను నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే శంకర్ నాయక్ (Banoth Shankar Naik) తెలిపారు. సూర్య చంద్ర చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ జాబ్ మేళాను నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. అక్టోబర్ 9న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ జాబ్ మేళా కొనసాగుతుందని తెలిపారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు అక్టోబర్ ఉదయం 9 గంటల మహబూబాబాద్ న్యూ ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసుకు (MLA Camp Office) అన్ని ధ్రువపత్రాలతో హాజరు కావాలని తెలిపారు.
📢 Attention Job Seekers in Mahbubabad! 🌟
Are you looking for a golden opportunity to kickstart your career? Look no further! We’re excited to invite you to our Mega Job Mela at the MLA Camp Office in Mahbubabad.
📅 Date: 9th,Oct,2023.
⏰ Time: 9am to 4pm
🏢 Venue: New MLA… pic.twitter.com/HEuVW0yEgp— Banoth Shankar Naik (@BSNBRS) October 6, 2023
ఉద్యోగ కల్పనే లక్ష్యంగా వివిధ రంగాలకు ప్రైవేటు సంస్థల ప్రతినిధులు, నిరుద్యోగ యువతకు పలు ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్న ఉద్దేశ్యంతో ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ ఈ ఉద్యోగ మేళాను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ ఉద్యోగమేళాలో పలు ప్రైవేట్ కంపెనీలు పాల్గొనున్నాయి. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు న్యూ ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో ఈ జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. జిల్లాలో ఉన్న నిరుద్యోగల యువత, పదోతరగతి, ఇంటర్, ఐటీఐ, డిప్లోమా, గ్రాడ్యుయేషన్, పీజీ చదివిన నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే శంకర్ నాయక్ అన్నారు. నిరుద్యోగులు పాల్గొని ఉద్యోగా అవకాశాలను పొందాలని ఆయన వివరించారు. పూర్తి వివరాలు, సమాచారం కోసం 8978347245, 80193 97245 నెంబర్లను సంప్రదించాలని కోరారు.
ఇది కూడా చదవండి: ఒళ్లు గగుర్పొడిచేలా వార్ వీడియోలు..భయంకర దాడులు.. 298 మంది మృతి..!
మీ డ్రీమ్ జాబ్‌ని పొందేందుకు ఈ అవకాశాన్ని కోల్పోకండి. మీ భవిష్యత్తు వేచి ఉంది! మెగా జాబ్ మేళాలో కలుద్దాం. మీ కెరీర్ కలలను నిజం చేద్దామంటూ తెలిపారు.