Bus Accident: అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో బీవీసీ కాలేజీ బస్సుబోల్తా పడింది. స్టీరింగ్ ఫెయిల్ కావడంతో బస్సు పల్టీలు కొట్టడంతో పక్కనే ఉన్న కాలువలోకి దూసుకెళ్లింది. ఈ సంఘటన ఉప్పలగుప్తం సరిపల్లి వద్ద జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో విద్యార్థులు బస్సులోనే ఉన్నారు. అయితే ఈ ప్రమాదంలో ఎవరికి ఏమి కాకపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పింది.
కాలేజీ సమయం ముగిసిన తరువాత విద్యార్థులను ఇంటి వద్ద దించడానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అయితే బీవీసీ కాలేజీ బస్సులు తరచూ ప్రమాదాలు జరుగుతున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. గతంలో ఓ సారి రన్నింగ్ ఉండగా ఊడిన బస్సు టైర్లు, మరో చోట బస్సులో మంటలు చెలరేగినట్లు తెలిపారు.
తరచూ ప్రమాదాలు జరుగుతున్నా.. ఆర్టీవో అధికారులు పట్టించుకోవడంలేదని స్థానికులు విమర్శిస్తున్నారు. మరి ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు తీసుకుంటారో లేదో చూడాలి.