Jasprit Bumrah Sanjana Ganesan become parents: భారత క్రికెట్ జట్టు పేసర్ జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) , భార్య సంజనా గణేషన్‌కు మగబిడ్డ జన్మించాడు. తన భార్యతో కలిసి ఉండటానికి ఆసియా కప్ నుంచి హాలీడే తీసుకున్న బుమ్రా.. మగబిడ్డ పుట్టిన వార్తను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. ‘మా చిన్న కుటుంబం పెరిగింది, మా హృదయాలు మనం ఊహించలేనంతగా నిండుగా ఉన్నాయి! ఈ ఉదయం మేము మా చిన్న పిల్లవాడు అంగద్ జస్ప్రీత్ బుమ్రాను (Angad Jasprit Bumrah) ప్రపంచానికి స్వాగతించాం. మేము చంద్రునిపైకి వచ్చాం.. మా జీవితంలోని ఈ కొత్త అధ్యాయం కోసం వేచి ఉండలేం. దానితో పాటు వస్తుంది’ అని బుమ్రా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు.
View this post on Instagram
శ్రీలంక నుంచి ఇండియాకు బుమ్రా:
ప్రస్తుతం ఆసియా కప్‌లో ఆడుతున్న బుమ్రా నిన్న ఉన్నపళంగా ఇండియా ఫ్లైటెక్కాడు. అందరూ ఏమైందో.. ఎందుకు వెళ్లిపోయారో అనుకున్నారు కానీ అసలు విషయం ఇవాళ తెలిసింది. తన భార్య డెలవరీ డేట్ రావడంతో బుమ్రా స్వదేశానికి తిరిగి వచ్చేశాడని అర్థమైంది. ఇక బుమ్రా ఎప్పుడు జట్టుతో కలుస్తాడన్న విషయంపై క్లారిటీ లేదు. అయితే రానున్న ప్రపంచ్ కప్‌లో మాత్రం బుమ్రానే కీలక ప్లేయర్. వెన్ను గాయం కారణంగా దాదాపు ఏడాది పాటు క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు బుమ్రా. ఇటివలే ఐర్లాండ్ టూర్‌తో రీఎంట్రీ ఇచ్చి సత్తా చాటాడు బుమ్రా. వెంటనే ఆసియా కప్ (Asia Cup 2023) కోసం భారత జట్టులోకి వచ్చాడు. పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. దీంతో బుమ్రా యార్కర్లను టీమిండియా అభిమానులు మిస్ అయ్యారు. బౌలింగ్‌కి సహకరించిన పల్లెకెల్లే పిచ్‌పై బుమ్రా ఆడి ఉంటే పాక్ బ్యాటర్ల వణికిపోయేవారు.
మళ్లీ శ్రీలంకకు బుమ్రా:
సూపర్-4 స్టేజీ నుంచి బుమ్రా అందుబాటులో ఉంటాడని సమాచారం. భారత జట్టు బుమ్రాకు పుష్కలంగా మ్యాచ్ ప్రాక్టీస్ ఇవ్వడం చాలా ముఖ్యం. ఎందుకంటే జట్టులో అతిపెద్ద అసెట్ అతను. ఇక బుమ్రా భార్య సంజన, ప్రఖ్యాత టెలివిజన్ బ్రాడ్‌కాస్టర్. 2014లో ఎంటీవీ స్ల్పిట్స్‌విల్లా షో సీజన్ 7 ద్వారా సంజన గుర్తింపు తెచ్చుకున్నారు. సన్నీ లియోనీ, నిఖిల్ చిన్నప్ప హోస్ట్ చేసిన ఈ షో మధ్యలోనే గాయం కారణంగా సంజన తప్పుకున్నారు. ప్రస్తుతం స్టార్ స్పోర్ట్స్‌లో టీవీ ప్రెజెంటర్‌గా పనిచేస్తున్నారు సంజన. తన ఇన్స్టాగ్రామ్ బయోగ్రఫీలో ‘టీవీ ప్రెజెంటర్ ఫర్ స్టార్ స్పోర్ట్స్ ఇండియా, డిజిటల్ హోస్ట్, దట్ మిస్ ఇండియా గర్ల్’’ అని ఉంటుంది. ఈ ఇద్దరు మార్చి 2021లో వివాహం చేసుకున్నారు. విరాట్ కోహ్లి-అనుష్క శర్మ లేదా హార్దిక్ పాండ్యా -నటస్సా స్టాంకోవిచ్ వంటి వారి తోటి క్రికెటర్లలా కాకుండా.. ఈ జంట తమ ప్రేమ సంబంధాన్ని తెలివిగా దాచిపెట్టారు.
ALSO READ: మీ ఫ్రెండ్షిప్ బౌండరీ రోప్ బయట చూపించుకోండి.. గంభీర్ చురకలు!