ఇప్పుడు దేశంలో నడుస్తున్న రెండు ముఖ్యమైన అంశాలు ఏంటి అంటే ఒకటి ఢిల్లీలో జరుగుతున్న జీ 20 సమావేశాలు(G20 Summit)..రెండు బాలీవుడ్ బాద్ షా షారూక్ ఖాన్ నటించిన జవాన్ (Jawan) చిత్రం. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదలై మంచి కలెక్షన్లు రాబడుతోంది. గురువారం వరల్డ్ వైడ్ గా విడుదల అయిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబడుతోంది.
ఈ సినిమా విడుదలైన రెండు రోజులకే 200 కోట్లను రాబట్టి గత రికార్డులను తిరగరాసింది. ఈ సినిమాలో షారూక్ నటనకు అటు అభిమానులు , ప్రేక్షకులే కాదు..సినీ ప్రముఖులు కూడా ఫిదా అవుతున్నారు. ఈ క్రమంలోనే దర్శకు ధీరుడు రాజమౌళి, టాలీవుడ్ సూపర్ స్టార్ ఈ చిత్రం పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.
ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈ సినిమా చూసేందుకు మహారాష్ట్రలోని జలగన్ నగరంలోని షారూక్ అభిమానులు ఏకంగా ఎడ్ల బండ్లు ఎక్కి మరి థియేటర్లుకు వస్తున్నారు. ట్రాక్టర్లు, జేసీబీలు, బైక్ లు, కార్లు ఇలా అన్ని వాహానాల్లో అభిమానులు థియేటర్లకు వచ్చి మరి సినిమా చూస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి.
ఈ వీడియోలు చూసిన షారూక్ అభిమానులు ఈ వీడియోలను తెగ వైరల్ చేస్తున్నారు. సంవత్సరాల తర్వాత షారుఖ్‌ఖాన్ సినిమాకు కూడా ఈ విధంగా థియేటర్‌కు ట్రాక్టర్లలో ప్రేక్షకులు రావడంతో సినీ అభిమానులు ఫుల్ ఖుషీలో ఉన్నారు.
https://twitter.com/Kabir175/status/1700403018938925523?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1700403018938925523%7Ctwgr%5E6cafd7e3ed7ba9de3257239edebf6c15f571d783%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.ntnews.com%2Fcinema%2Ffarmers-on-the-way-to-watch-jawan-on-tractor-and-bullock-1243862