Saindhav Emotional Song : శైలేష్ కొలను దర్శకత్వంలో వెంకటేష్(Venkatesh) హీరోగా రాబోతున్న లేటెస్ట్ చిత్రం ‘సైంధవ్’(Saindhav). విక్టరీ వెంకటేష్ 75 వ సినిమాగా ఈ చిత్రం తెరకెక్కింది. సినిమాను నిహారిక ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్నారు. సంక్రాంతి(Sankranti) కానుకగా జనవరి 13న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. వెంకటేష్ కెరీర్ లో ఈ చిత్రం చాలా స్పెషల్ గా ఉండబోతుంది. వెంకటేష్ 75 వ చిత్రంగా ‘సైంధవ్’ వెంకీ అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. ఇటీవలే వెంకటేష్ 75 వ సినిమా సందర్భంగా సైంధవ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ చాలా స్పెషల్ గా ముగిసింది. ప్రీ రిలీజ్ ఈవెంట్ కు అగ్ర నటుడు చిరంజీవి(Chiranjeevi) పలు యువ హీరోలు హాజరు అయ్యారు. సినిమా సంక్రాంతికి విడుదల కానున్న నేపథ్యంలో ప్రమోషన్స్ కూడా జోరుగా సాగుతున్నాయి.
Also Read: Kurchi Thata : మహేష్ బాబుతో నా డాన్స్ చూస్తే.. కుర్చీలు మడత పెట్టాల్సిందే..!
తాజాగా చిత్ర బృందం సైంధవ్ నుంచి ‘బుజ్జికొండ'(Bujjikonda) అనే ఎమోషనల్ సాంగ్ లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు. తండ్రి కూతుళ్ళ అనుబంధం ప్రధానంగా ఈ పాట సాగింది. అనారోగ్యంతో బాధపడుతున్న కూతురిని చూసి తండ్రి కలత చెందడం.. బాధను దాచుకొని ఆ చిన్నారిని సంతోష పరిచే భావోద్వేగ సన్నివేశాలతో ఈ పాట అందరి మనసుల్ని ఆకట్టుకునేలా ఉంది. లిరిక్స్ కూతురి పై తండ్రికి ఉన్న ప్రేమను తెలియజేసేలా ఉన్నాయి. పాటలో పాపతో వెంకటేష్ ఎమోషనల్ సీన్స్ ప్రేక్షకులను పెట్టించేలా సాగాయి. పాటకు రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ రాశారు. ఎస్.పీ చరణ్ అద్భుతమైన గాత్రాన్ని అందించారు. సినిమాలో శ్రద్ధా శ్రీనాథ్ కథానాయికగా.. బేబీ సారా, నవాజుద్దీన్ సిద్ధిఖీ, ఆర్య,రుహాని శర్మ, ఆండ్రియా జెరెమియా ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు.
Also Read: Big 4: ఎన్నాళ్లకెన్నాళ్లకు.. ఒకే వేదికపై చిరు, బాలయ్య, వెంకీ, నాగ్.. ఎందుకంటే?