Property Purchase: సొంతిల్లు చాలామంది కల. ఆ కలను సాకారం చేసుకోవడానికి తమ జీవితంలో.. జీతంలో చాలా భాగాన్ని ఖర్చు చేసేస్తారు. ఇల్లు కొనాలని అనుకున్నపుడు ఎన్నో ఆప్షన్స్ కనిపిస్తాయి. కొద్దిగా డబ్బు పోగేసి.. మిగిలినది లోన్ తీసుకుని ఇల్లు కొనాలని ఎక్కువ శాతం ప్రయత్నాలు చేస్తారు. ఇల్లు కొనాలంటే అంటే ఎక్కడ.. ఎటువంటి ఇల్లు కొనాలి అనేది అన్నిరకాలుగానూ ఆలోచించి తీసుకోవాల్సిన నిర్ణయం. సాధారణంగా ఎవరో సలహా ఇస్తే ఎదో ఒక బిల్డర్ ను సంప్రదించడం.. ఆ బిల్డర్ చూపించిన ప్రాజెక్ట్ మనకు నచ్చడం.. ఇల్లు కొనాలని సిద్ధం అయిపోవడం.. చాలా సహజంగా జరిగిపోతాయి. ఇక్కడే చాలాసార్లు మనం తప్పులో అడుగేస్తాం. చాలా సార్లు న్యాయ వివాదాల కారణంగా ప్రజలు మోసాల్లో కూరుకుపోతారు. బిల్డర్లు లేదా డెవలపర్లు అందరూ డిఫాల్టర్లు కానప్పటికీ, కస్టమర్ మోసపోయిన అనేక సంఘటనలు ఎప్పటికప్పుడు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. రెరా చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత ఇలాంటి కేసులను కూడా కొంత వరకు అరికట్టారు. అయినా.. ఇలాంటి మోసాలను నివారించడానికి ఉత్తమ మార్గం ఏమిటంటే, మనం ఇంటిని కొనుగోలు చేస్తున్న బిల్డర్ లేదా డెవలపర్ కు సంబంధించిన మొత్తం సమాచారం మన వద్ద ఉండాలి.
బిల్డర్ గత ప్రాజెక్టులు సకాలంలో పూర్తయ్యాయా లేదా? మార్కెట్ లో ఆ బిల్డర్ కు ఉన్న ఇమేజ్ ఏంటి? గతంలో ఆ బిల్డర్ ఏదైనా వివాదాల్లో చిక్కుకున్నాడా? ఇలాంటి విషయాలను చెక్ చేసుకోవాలి. బిల్డర్ ను ఎంచుకోవాలంటే ఎటువంటి మార్గాలను అనుసరించాలో ఇక్కడ తెలుసుకుందాం.
- బ్యాంక్ ప్రీ అప్రూవల్ లిస్ట్:
ఎవరైనా బిల్డర్ విశ్వసనీయత తెలుసుకోవాలి అంటే బ్యాంక్ ప్రీ అప్రూవల్ లిస్ట్ చెక్ చేసుకోవచ్చు. కనీసం మూడు లేదా ఎక్కువ బ్యాంకుల ప్రీ అప్రూవల్ లిస్ట్ లో ఉన్న బిల్డర్ లేదా డెవలపర్ ను(Property Purchase) ఎంచుకోవడం మంచిది. ఎందుకంటే, లోన్ ఇచ్చే ముందు ఏదైనా డెవలపర్ ప్రాజెక్ట్ చట్టపరమైన చెల్లుబాటును బ్యాంక్ లోతుగా పరిశీలిస్తుంది. ఒక ప్రాజెక్టు మూడు కంటే ఎక్కువ బ్యాంకుల ప్రీ-అప్రూవల్ లిస్ట్ లో ఉంటే, దానిని విశ్వసించవచ్చు.
- బిల్డర్ డెలివరీ ట్రాక్ రికార్డు..
ఏదైనా రెసిడెన్షియల్ ప్రాజెక్ట్‌లో పెట్టుబడి పెట్టే ముందు బిల్డర్ గత రికార్డును చెక్ చేయడం మరిచిపోవద్దు. గత ప్రాజెక్టుల్లో ఇంటి డాక్యుమెంట్స్ సకాలంలో కస్టమర్స్ కి ఇచ్చారో లేదో… ఆలస్యమైతే కారణం ఏంటి? ఆ జాప్యాన్ని పూడ్చడానికి బిల్డర్ లేదా డెవలపర్ ఎలాంటి చర్యలు తీసుకున్నారు? ఇవన్నీ చూసిన తర్వాత ఇల్లు కొనడం కోసం ముందడుగు వేయండి. దీని కోసం, మార్కెట్ రేట్ కంటే తక్కువ ధరకే ఇల్లు లభిస్తున్నప్పటికీ..కొత్త బిల్డర్ ప్రాజెక్టులో పెట్టుబడి పెట్టకుండా ఉండటం మంచిది.
- ప్రాజెక్ట్ నాణ్యత..
బిల్డర్ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ (Property Purchase)నాణ్యతను తెలుసుకోవడానికి, అతని పాత ప్రాజెక్ట్ ను పరిశీలించవచ్చు. ఇందులో ఎలాంటి నిర్మాణ సామగ్రిని ఉపయోగించారు? పార్కులు వంటి బహిరంగ ప్రదేశాలు అందుబాటులో ఉన్నాయా? ఇంటి లోపల ఎలాంటి నాణ్యమైన వస్తువులు వాడారు వంటి విషయాలను పాత ప్రాజెక్ట్ లను చూసి చెక్ చేసుకోవచ్చు. అక్కడ నివసిస్తున్న వారి నుంచి కూడా సమాచారం పొందవచ్చు. ఉదాహరణకు, ఇంటిని హ్యాండోవర్ చేసుకోవడంలో ఏదైనా లెట్ అయిందా వంటి విషయాలను వారి వద్ద నుంచి తెలుసుకోవచ్చు.
Also Read: బిఎస్ఇ-లిస్టెడ్ కంపెనీల రికార్డ్.. భారీగా పెరిగిన మార్కెట్ క్యాప్..
- బిల్డర్ ఆర్థిక పరిస్థితి తెలుసుకోండి..
స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన కంపెనీ లేదా గ్రూప్ బ్యాలెన్స్ షీట్ పబ్లిక్ డొమైన్లో(Property Purchase) ఉంటుంది. అటువంటి సమూహంఆర్థిక స్థితిని సులభంగా చెక్ చేయవచ్చు. బ్యాలెన్స్ షీట్లు పబ్లిక్ డొమైన్లో లేని వారు వారి ఆర్థిక స్థితిని తెలుసుకోవడానికి కొంత దర్యాప్తు చేయవలసి ఉంటుంది. ఇందులో డెవలపర్, బ్రోకర్ లేదా కాంట్రాక్టర్ సహాయం తీసుకోవచ్చు. మనీ డీల్ లో బిల్డర్ వైఖరి అతని ఆర్థిక పరిస్థితిని పరీక్షించడానికి కొలమానంగా ఉంటుంది.
- ఇల్లు నిర్మిస్తున్న స్థలం
బిల్డర్ ఇంటిని నిర్మిస్తున్న(Property Purchase)స్థలం సొంతమో కాదో తెలుసుకోవడం అవసరం. రెసిడెన్షియల్ ప్రాజెక్టులో ఇల్లు కొనేటప్పుడు, అది నిర్మించే స్థలం యాజమాన్యం బిల్డర్ వద్ద ఉంటుందని సాధారణంగా అనుకుంటాం. కానీ, ఒక్కోసారి ఆ స్థలం అతని సొంత స్థలం కాకపోవచ్చు. ఇలాంటి కేసులు అనేకం వెలుగులోకి వచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఈ పరిస్థితి రాకుండా ఉండాలంటే ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని అనుమతులను చెక్ చేస్తూనే ఆ స్థలానికి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా చెక్ చేసుకోవాలి. ఈ విషయంలో లాయర్ సహాయం తీసుకోవడం మంచిది. ఎందుకంటే, ఆ భూమిపై ఏదైనా లీగల్ ఇష్యూ ఉంటె స్పష్టం అవుతుంది.
Watch this interesting Video: