Bhimavaram : పశ్చిమగోదావరి జిల్లా భీమవరం(Bhimavaram) మావుళ్ళమ్మ అమ్మవారి ఆలయంలో(Mavullamma Temple) రసాభాస నెలకొంది. ఈ ఏడాది అమ్మవారి ఉత్సవాలకు ఎటువంటి కనీస సౌకర్యాలు లేవంటూ ఆలయంలో నిరసన చేపట్టారు ఆర్ఎస్ఎస్, విహెచ్పి, బజరంగ్ దళ్, గో సంరక్షణ నాయకులు. ఆలయంలో గంట తొలగింపుపై వివాదం మొదలైంది. గంట ఉండటం వల్ల ఆలయంలో సౌండ్ ఇబ్బందిగా వుందంటూ ఆలయ అధికారులు తొలగించమని చెప్పడంతో విభేదాలు వచ్చినట్లు తెలుస్తోంది.
సమాధానం చెప్పాల్సిందే
దాదాపు రెండు గంటల పాటు ఆలయ అధికారులు, విశ్వ హిందు పరిషత్(Vishwa Hindu Parishad) నాయకుల మధ్య వాగ్వివాదం నెలకొంది. గత 20 సంవత్సరాల క్రితం అమ్మవారికి సమర్పించిన 16కేజీల బంగారు చీర ఏమైంది? అంటూ ఆలయ అధికారులను ప్రశ్నించారు ఆర్ఎస్ఎస్, విహెచ్ పి, బజరంగ్ దళ్, గో సంరక్షణ నాయకులు. అసలు అమ్మవారి మెడలో వున్న బంగారు ఆభరణాలు ఒరిజినల్ ఏ నా అని ఆలయ అధికారులను హిందు ధార్మిక సభ్యులు నిలదిశారు. 16 కేజీల అమ్మవారి బంగారు చీరకు సమాధానం చెప్పకుంటే పెద్ద ఎత్తున ఉద్యమం చేయటానికి సిద్ధమంటూ తేల్చిచెబుతున్నారు విశ్వ హిందు పరిషత్ నాయకులు.
Also Read: నేను చేసింది తప్పే.. ఆలస్యంగా తెలుసుకున్నా: సమంత పశ్చాత్తాపం
కాగా, భీమవరంలోని శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి 60వ జాతర మహోత్సవాలు ఈనెల 13న ఘనంగా ప్రారంభం అయ్యాయి. ఉభయ గోదావరి జిల్లాల్లో నెల రోజులపాటు నిర్వహించే ఏకైక ఉత్సవాలుగా మావుళ్లమ్మవారి ఉత్సవాలు ప్రసిద్ది చెందిన విషయం తెలిసిందే. గత 59 ఏళ్లుగా నీరుల్లి కూరగాయ, పండ్ల వర్తక సంఘం ఆధ్వర్యంలో దేవస్థాన సహకారంతో అమ్మవారి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు.