Sun Screen: సాధారణంగా వింటర్ సీజన్ లో చర్మ సమస్యలు ఎక్కువగా కనిపిస్తాయి. చర్మం పొడిబారడం, పగుళ్లు, పేలిపోవడం జరుగుతుంది. చర్మ సౌందర్యాన్ని మెరుగ్గా, ఆరోగ్యంగా ఉంచాలంటే స్కిన్ కేర్ ప్రాడక్ట్స్, స్కిన్ కేర్ రొటీన్, హెల్తీ డైట్ తప్పనిసరి. స్కిన్ కేర్ ప్రాడక్ట్స్ లో చాలా మంది ఎక్కువగా వాడేది సన్ స్క్రీన్. కేవలం సమ్మర్ లోనే కాదు వింటర్ లో కూడా ఇది చర్మం పై మంచి ప్రభావం చూపుతుంది. సన్ వల్ల కలిగే మరిన్ని ఉపయోగాలు తెలుసుకుందాం
సన్‌స్క్రీన్ వల్ల కలిగే లాభాలు
సూర్య కిరణాల నుంచి రక్షించును
సమ్మర్ లోనే కాదు చలికాలములో కూడా సూర్యుని నుంచి వచ్చే UV రేస్ మొహానికి హానికరం. ఈ కిరణాలు చర్మం లోపలి వరకు వెళ్లి దీర్ఘ కాల సమస్యకు కారణమవుతాయి. సన్ స్క్రీన్ చర్మాన్ని ఈ సమస్యల నుంచి కాపాడడానికి రక్షణ కవచంలా పనిచేస్తుంది.
UV రేడియేషన్ నుంచి కాపాడును
UV రేడియేషన్ చర్మం పై అకాల వృద్ధాప్య ఛాయలు, చర్మ క్యాన్సర్ కలిగించే ప్రమాదం ఉంటుంది. చాలా మంది చలికాలంలో UV రేస్ ప్రభావం తక్కువగా ఉంటుందని భావిస్తారు. కానీ ఈ సీజన్ లో కూడా చర్మం పై వీటి ప్రభావం ఉంటుంది. రొటీన్ గా సన్ స్క్రీన్ వాడితే.. చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు హానికర సమస్యలను దూరం చేస్తుంది.
హైపర్పిగ్మెంటేషన్ నివారణ
మొహం పై పడే సూర్య కిరణాలు హైపర్ పిగ్మెంటేష్ కు కారణమవుతాయి. దీని వల్ల చర్మ రంగు మారడం, డార్క్ స్పాట్స్ వంటి సమస్యలు వస్తాయి. రోజూ సన్ స్క్రీన్ అప్లై చేస్తే ఈ సమస్యలు తగ్గిపోయి.. చర్మం ప్రకాశవంతంగా మెరుస్తుంది.
మాశ్చురైజింగ్
చలికాలంలో చర్మం పొడబారడం జరుగుతుంది. కావున ప్రతీ రోజూ సన్ స్క్రీన్ అప్లై చేస్తే.. వీటిలోని మాశ్చురైజింగ్ గుణాలు చర్మాన్ని తేమగా మృదువుగా ఉంచుతుంది. సన్ స్క్రీన్ కేవల UV రేస్ నుంచి రక్షించడమే కాదు చర్మం పొడిబారకుండా కాపాడుతుంది.
Also Read: Acidity Remedy: గ్యాస్ ట్యాబ్లెట్ అవసరమే లేదు.. ఈ పొడితో అసిడిటీ సమస్యకు చెక్!