Fraud Calls: మేం ముంబయి క్రైం బ్రాంచ్ నుంచి ఫోన్ చేస్తున్నాం. మీ పేరుతో ఒక పార్శిల్ వచ్చింది. అందులో నకిలీ పాస్‌పోర్టులు, డ్రగ్స్ ఉన్నాయి. మీకు ఉగ్రవాద మాస్టర్ మైండ్ అయిన మహ్మద్‌తో పలు బ్యాంకుల్లో జాయింట్ అకౌంట్స్ ఉన్నట్లు మా విచారణలో తేలింది. మీరు టెర్రరిస్టు కేసులో ఇరుక్కున్నారంటూ నకిలీ పోలీసుల పేరుతో సైబర్ నేరగాళ్లు ఫోన్ కాల్స్ చేస్తూ భయపెడుతున్నారు. పార్శిళ్లలో డ్రగ్స్, తీవ్రవాదులతో బ్యాంక్ లావాదేవీలు చేశారంటూ భయానికి గురిచేస్తూ కోట్లలో దోచుకుంటున్నారు.ఏమాత్రం అనుమానం రాకుండా..పోలీసుల్లానే బిల్డప్ ఇస్తున్నారు. తమ ఐడీ కార్డులను, ఎఫ్ఐఆర్ కాపీలను పంపిస్తూ మోసాలకు పాల్పడుతున్నారు.
తాజాగా ఐఐటీ హైదరాబాద్ పీహెచ్డీ స్కాలర్‌కి ఫోన్ కాల్ చేసి రూ.30 లక్షలను దోచుకున్నారు. తను ఉగ్రవాదులతో కలిసి జాయింట్ అకౌంట్ తీశారని, అందులో అనుమానస్పద లావాదేవీలు జరిగినట్లు బెదిరించారు. తన లాప్ టాప్‌ను, ఫోన్‌ను ఉగ్రవాదులు హ్యాక్ చేశారని భయభ్రాంతులకు గురిచేశారు. ఉగ్రవాద స్లీపర్ సెల్స్‌తో తన కుటుంబానికి ప్రాణహాని ఉందని, హౌజ్ అరెస్ట్ చేస్తున్నామంటూ చెప్పి ఆరు రోజుల పాటు ఇంట్లోంచి బయటకు రాకుండా పక్కా ప్లాన్ చేశారు. ఈ కేసులతో తనకేం సంబంధం లేదని చెప్పిన వినలేదు.
*డ్రగ్ పార్శిళ్ల పేరుతో నకిలీ పోలీసుల ఫోన్ కాల్స్.. జాగ్రత్త!
*ఉగ్రవాదులతో సంబంధాలున్నాయంటూ కాల్స్
*స్లీపర్ సెల్స్ నుంచి ప్రాణహాని అంటూ బెదిరింపులు
*ఐఐటీ పీహెచ్డీ స్కాలర్‌కు రూ.30 లక్షల కుచ్చుటోపీ
”హాలో.. మేం ముంబై క్రైం బ్రాంచీ నుంచి మాట్లాడుతున్నాం. మీ పేరుతో FedEx… pic.twitter.com/tUEYA3QhDr
— V.C. Sajjanar, IPS (@SajjanarVC) March 24, 2024
జాయింట్ అకౌంట్లో ఎన్నో అనుమానస్పద లావాదేవీలున్నాయని, వాటిని పరిశీలించాలని మాయమాటలు ఎన్నో చెప్పారు. తన కుటుంబ సభ్యులు పొదుపు చేసుకున్న రూ.31 లక్షలను తమ బ్యాంక్ ఖాతాల్లోకి ట్రాన్స్ ఫర్ చేయించుకున్నారు. లావాదేవీలు సక్రమంగా ఉంటే ఆ నగదును తిరిగి మీకు ఇచ్చేస్తామంటూ నమ్మబలికారు. డబ్బు పంపించిన తర్వాత అక్కడి నుంచి ఎలాంటి స్పందించలేదు. చివరికి మోసపోయానని గుర్తించిన ఆ ఐఐటీ పీహెచ్డీ స్కాలర్.. సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించాడు. మీరు ఒకవేళ మోసానికి గురైతే వెంటనే సైబర్ క్రైం హెల్ప్ లైన్ నంబర్ 1930 ఫోన్ చేయండి. లేదా స్థానిక పోలీస్ స్టేషన్‌ను సంప్రదించి ఫిర్యాదు చేయమని పోలీసులు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి : తేడావస్తే “రంగు పడుద్ది..” హోలీ పండగపూట ఈ జాగ్రత్తలు తీసుకోవల్సిందే.!