Barrelakka pre wedding Video: తెలుగు రాష్ట్రాల్లో బర్రెలక్క ఎంత ఫేమసో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లోనూ పోటి చేసిన బర్రలెక్క అటు ఏపీలోనూ చాలా పాపులర్. ఎన్నికల తర్వాత యువతలో ఫుల్ క్రేజ్ తెచ్చుకున్న బర్రెలక్క తాజాగా పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు తెలిపింది. తన కాబోయే భర్తతో పాటు , పెళ్లి తేదీని కూడా అనౌన్స్ చేసింది బర్రెలక్క.
బర్రెలక్క ప్రీ వెడ్డింగ్ వీడియో
మార్చి 28న వెంకటేశ్ అనే అబ్బాయితో బర్రెలక్క వివాహం జరగనున్నట్లు ప్రకటించింది. అతను ఎమ్మెస్సీ ఫిజిక్స్ పూర్తి చేసినట్లుగా సమాచారం. అయితే తాజాగా తన కాబోయే భర్తను పరిచయం చేస్తూ ప్రీ వెడ్డింగ్ వీడియోను రిలీజ్ చేసింది బర్రెలక్క. ‘ఓ శిరీషా.. నా శిరీషా..’ అంటూ తన కోసమే ప్రత్యేకంగా రాసిన పాటతో ప్రీ వెడ్డింగ్ షూట్ చేయించుకుంది. అప్పట్లో ‘అనితా ఓ అనితా’ పాటతో తెలుగు యువతను ఓ ఊపు ఊపిన నాగరాజు ఈ పాటను పాడారు. ప్రస్తుతం ఈ సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. దీంతో అందరూ బర్రెలక్కకు శుభాకాంక్షలు తెలిజేస్తూ కామెంట్స్ చేస్తున్నారు.
తెలంగాణ ఎన్నికల్లో కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ క్యాండెట్ గా పోటీ చేసిన బర్రెలక్క 5,754 ఓట్లతో.. నాలుగవ స్థానంలో నిలిచింది. ఇక బర్రెలక్క వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే.. ఆమెకు ఇద్దరు తమ్ముళ్లు, తల్లి రోజూ కూలి. ఆర్ధిక ఇబ్బందుల కారణంగా చదువు మానేసిన బర్రెలక్క తల్లికి సహాయంగా ఉంటూ ఓపెన్ డిగ్రీ చేస్తున్నట్లు ఓ సందర్భంలో చెప్పుకొచ్చింది.
Also Read: Brahmanandam: హస్య బ్రహ్మా వరం.. రూ.2లక్షల సాయం.. నువ్వు నిజంగా దేవుడివి బాసు!