Barrelakka About Her Marriage: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన బర్రెలక్క రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఫుల్ ఫేమస్ అయ్యింది. ఎన్నికల తర్వాత ఎంతో మంది యువతకు స్ఫూర్తిగా నిలిచిన బర్రెలక్క.. తాజాగా పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు ప్రకటించింది. అయితే ఈ విషయాన్ని బర్రెలక్క అనౌన్స్ చేసినప్పటి నుంచి తన పెళ్ళికి సంబంధించి సోషల్ మీడియాలో రకరకాల చర్చలు జరుగుతున్నాయి.
బర్రెలక్క పెళ్లి నిజమేనా..? ఆమెది లవ్ మ్యారేజ్ ఆర్ పెద్దలు కుదిర్చిన వివాహమా.? బర్రెలక్క పెళ్లి చేసుకోబోయే అబ్బాయి ఎవరు..? పెళ్లి తర్వాత రాజకీయాలు కొనసాగిస్తుందా..? ఇలా పలు రకాల అంశాల పై చర్చించుకుంటున్నారు బర్రెలక్క ఫ్యాన్స్. తాజాగా ఆర్టీవీ ఇంటర్వ్యూ లో పాల్గొన్న బర్రెలక్క మొదటి సారి తన పెళ్లి గురించి నోరు విప్పింది. తాను ఎవరిని పెళ్లి చేసుకోబోతుంది..? వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తుందా లేదా అనే దాని పై క్లారిటీ ఇచ్చింది.
పెళ్లి పై బర్రెలక్క సమాధానం
ఆర్టీవీతో బర్రెలక్క మాట్లాడుతూ.. “చాలా మంది పెళ్లి నిజమేనా లేదా ఏదైనా షార్ట్ ఫిల్మ్ కోసమా అని డౌట్ పడుతున్నారు. కానీ నా పెళ్లి నిజమే. ఈ నెల 28న వివాహం అందరు తప్పకుండా రండి. మాది లవ్ మ్యారేజ్ కాదు పెద్దలు కుదిర్చిన వివాహం. నేను పెళ్లి చేసుకోబోయే అబ్బాయి పేరు వెంకటేష్.. తను మా చుట్టాలబ్బాయి. పెళ్లి తర్వాత కూడా నేను రాజకీయాల్లో కొనసాగుతాను. రాజకీలంటే మా ఇద్దరికీ ఆసక్తే. వచ్చే ఎంపీ ఎన్నికల్లో ఇద్దరు కలిసి పోటీ చేస్తాము” అని క్లారిటీ ఇచ్చింది బర్రెలక్క. పూర్తి ఇంటర్వ్యూ కోసం కింది వీడియోను చూడండి.