బీజేపీ సీనియర్ నాయకులు, త్రిపుర గవర్నర్ బండారు దత్తాత్రేయ కూతురు విజయ లక్ష్మి తన రాజకీయ ప్రవేశం గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. అలాయ్ బలాయ్ కార్యక్రమాన్ని బండారు విజయ లక్ష్మి కొనసాగిస్తున్నారు. అయితే ఈ కార్యక్రమం రాజకీయాలకు అతీతంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. తన రాజకీయ ప్రవేశం కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం లేదన్నారు. ఒకవేళ బీజేపీ తనకు అవకాశం ఇస్తే…ముషీరాబాద్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతానని స్పష్టం చేశారు. తనకు రాజకీయనేపథ్యం ఉన్నప్పటికీ తాను రాజకీయవారసురాలు అనడాన్ని విభేదిస్తాను అన్నారు. బీజేపీ ఫిలాసఫీ నచ్చి రాజకీయాల్లోకి వచ్చాను అన్నారు. బండారు విజయ లక్ష్మి ఇంకేం మాట్లాడారో ఈ ప్రత్యేక ఇంటర్వ్యూలో చూద్దాం.