Balagam Movie Actor Narsingam Passed Away: తెలుగు రాష్ట్రాలలో సంచలన సృష్టించిన ‘బలగం’ సినిమా(Balagam Movie) నటుడు.. ఆ సినిమా కీలక పోషించిన నర్సింగం చనిపోయారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న కీసరి నర్సింగం (Narsingam).. తుదిశ్వాస విడిచారు. నర్సింగం మృతి విషయం తెలుసుకున్న కమెడియన్, డైరెక్టర్ వేణు(Venu) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బలగం సినిమా సందర్భంగా నర్సింగంతో ఏర్పడిన అనుబంధాన్ని గుర్తు చేసుకుని భావోద్వేగానికి గురయ్యారు వేణు. ఆయన మృతికి సంతాపం తెలిపిన వేణు.. ‘నర్సింగం బాపుకి శ్రద్ధాంజలి. మీ చివరి రోజుల్లో బలగం సినిమా ద్వారా మీలోని నటుడిని చూసుకుని, మీలోని కళాకారుడు సంతృప్తి చెందడం నేను అదృష్టంగా భావిస్తున్నాను’ అంటూ ట్వీట్ చేశారు వేణు.
రాజన్నసిరిసిల్ల జిల్లా కొనరావుపేట మండలం నాగారం గ్రామానికి చెందిన నర్సింగం.. బలగం సినిమాలో సర్పంచ్‌గా కీలక పాత్ర పోషించారు. సర్పంచ్‌గా ఆయన పోషించిన పాత్ర యావత్ ప్రేక్షక లోకాన్ని ఎంతో అకట్టుకుంది. అచ్చం మన పల్లెటూర్లలో ఎలాగైతే పెద్దలు వ్యవహరిస్తారో.. అలాగే తన నటించి అందరినీ మెప్పించారు. కాగా, నర్సింగం మృతి పట్ల బలగం సినిమా సిబ్బంది శ్రద్ధాంజలి ఘటించింది. ఆయన మృతి తమను తీవ్రంగా కలచివేసిందంటూ సంతాపం తెలుపుతూ ట్వీట్లు చేస్తున్నారు.
వేణు వెల్దండి చేసిన ట్వీట్..
నర్సింగం బాపుకి శ్రద్ధాంజలి 🙏
మీచివరి రోజుల్లో బలగం సినిమా ద్వారా మీలోని నటుణ్ని మీరు చూసుకొని మీలోని కళాకారుడు తృప్తి చెందడం నేను అదృష్టంగా భావిస్తున్నాను. ఓంశాంతి🙏
బలగం కథ కోసం రీసర్చ్ చేస్తున్నప్పుడు మొదటగా నర్సింగం బాపునే కలిసాను.ఆరోజు కళ్ళు, గుడాలు తెప్పించాడు నాకోసం..🙏 pic.twitter.com/smDHR8ULyU— Venu Yeldandi #Balagam (@VenuYeldandi9) September 5, 2023
#Balagam movie #actor, #Narasimham is no more, he played the role of #Sarpanch in #Balagam movie. #JabardastVenu was Directed by this Balagam Movie. pic.twitter.com/WsK5w50IfM
— Sai Suresh K (@SaiSureshK99) September 5, 2023
బలగం సర్పంచ్ గా నటించిన శ్రీ కీసరి నర్సింగం గారు అనారోగ్య కారణాలతో కొద్ది సేపటి క్రితం చనిపోయారు. మీరు మీ రంగస్థల నాటక జీవితం లో చేసిన పాత్రలు బలగం లో మీ యొక్క పాత్ర ద్వారా అందరికి చిరకాలం గుర్తుంటారు.#బలగం #balagam #BalagamMovie pic.twitter.com/YDmpwPkbBS
— Pawankumar Reddy (@Pawan555459) September 5, 2023
Also Read:
Andhra Pradesh: లగడపాటి రీఎంట్రీ ఇవ్వబోతున్నారా? రసవత్తరంగా మారిన వీరి భేటీ..
Thummala Nageswara: కాంగ్రెస్‌లోకి తుమ్మల చేరికకు బ్రేక్.. పార్టీ మారుతారా?