కూతురు కోసం వెంకీ చేసిన పోరాటం
విక్టరీ వెంకటేష్ (Venkatesh) అంటే ఫ్యామిలీ డ్రామాలకు పెట్టింది పేరు.అలాగని యాక్షన్ సినిమాలు ఆయనకి కొత్త కాదు. ఎన్నో బ్లాక్ బస్టర్ రికార్డులు కూడా ఆయన నటించిన యాక్షన్ జానర్ మూవీస్ ఉన్నాయి.కాకపోతే..ఇటీవల కాలంలో ఈ జానర్ సినిమాలు తగ్గాయని చెప్పొచ్చు. ఇలాంటి క్రమంలో పవర్ ఫుల్ యాక్షన్ ఫిల్మ్ వస్తోందంటే చాలా క్యూరియాసిటి ఉంటుంది.ఈ రోజు రిలీజ్ అయిన థియేట్రికల్ ట్రైలర్ విషయానికి వస్తె.. శైలేష్ కొలను (Sailesh Kolanu) దర్శకత్వ ప్రతిభకు వెంకీ మామ యాక్షన్ తోడయితే ఎలా ఉంటుంది చెప్పండి బాక్స్ లు బద్దలవ్వాల్సిందే అనే రేంజ్ లో థియేట్రికల్ ట్రైలర్ కట్ చేశారు. కూతురు కోసం వెంకీ చేసిన పోరాటం అదిరిపోయింది.
‘సైకో’ పాత్రలో వెంకటేష్
మా నాన్న సూపర్ హీరో అంటూ పాప డైలాగ్ తో మొదలైన ట్రైలర్ మూడు నిమిషాల ముప్పై ఆరు సెకెండ్స్ నిడివితో చాలా ఎమోషనల్ గా సాగింది వెంకటేష్- బేబీ సారా మధ్య ఎమోషనల్ బాండింగ్ ఏ రేంజ్ లో ఉందొ .. యాక్షన్ ఎపిసోడ్స్ కూడా అంతకుమించి ఉన్నాయి.తండ్రి-కూతుళ్ల మధ్య ఉండే ఆ ప్రేమను చాలా చక్కగా ప్రెజెన్స్ చేశారు డైరెక్టర్. ఇక ‘సైకో’ పాత్రలో వెంకటేష్ దుమ్మురేపేసారు . తన కూతురికి వచ్చిన అరుదైన వ్యాధి నుంచి కాపాడేందుకు వెంకటేష పడిన తపన ట్రైలర్లో చాలా ఎమోషనల్‌గా చూపించారు
ఇంజెక్షన్ ధర రూ.17 కోట్లు
తన కూతురికి అరుదయిన నరాల వ్యాధి రావడంతో అర్జెంట్‌గా ట్రీట్మెంట్ ఇప్పించాలి. దాని కాస్ట్ రూ.17 కోట్లు అని డాక్టర్ చెప్పడంతో కథ పాకాన పడుతుంది. ఇక.. ఆ ఇంజక్షన్ సాధించేక్రమంలో వెంకటేష్ సైకో గా మారిన క్రమంలో = ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు? అనేది సినిమాలో చూడాల్సిందే.
యాక్షన్, ఎమోషన్స్ రెండింటినీ బ్యాలెన్స్
ఎమోషన్ , యాక్షన్ కలగలిపిన ఈ ట్రైలర్ ఆకట్టుకుంటోంది. ఇలాంటి పాత్రలు చేయడం వెంకీకి కొట్టిన పిండి. నా తల తీసుకొస్తే డబ్బులు ఇస్తామన్నారా .. నా తల తీసుకుళ్లాలంటే మీకు తలలుండాలి కదరా ..అంటూ వెంకీ యాక్షన్ పెర్ఫామెన్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉంది. హై స్టాండర్డ్ ప్రొడక్షన్ వ్యాల్యూస్ సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయి. స్టన్నింగ్ విజువల్స్ తో సినిమాటోగ్రఫీ అదిపోయింది. సంతోష్ నారాయణన్ అందించిన బిజియం నెక్స్ట్ లెవెల్ లో ఉంది.
ALSO READ:Chiranjeevi – Venkatesh – Saindhav : చిరు మూవీపై వెంకీ కామెంట్స్… సైంధవ్ విషయంలో జరిగేది ఇదే!!