Babu Mohan Son in BRS: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేళ బీజేపీకి బిగ్ షాక్ తగిలింది. ఆందోల్ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి బాబుమోహన్ తనయుడు ఉదయ్ బీఆర్ఎస్ పార్టీలో చేరారు. మంత్రి హరీష్ రావు ఆధ్వర్యంలో ఆదివారం నాడు ఆయన పార్టీ కండువా కప్పుకున్నారు. ఆందోల్ టికెట్ తనకు కాకుండా.. తన తండ్రికి కేటాయించడంపై తీవ్ర అసంతృప్తికి గురైన ఉదయ్.. బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
వాస్తవానికి గత ఎన్నికల్లో ఆందోల్ నుంచి బాబుమోహన్ బీజేపీ తరఫున పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో బాబు మోహన్ మూడవ స్థానంలో నిలిచారు. అయితే, ఈ ఐదేళ్ల కాలంలో బాబుమోహన్ తనయుడు బీజేపీలో యాక్టీవ్ అయ్యారు. పార్టీ కార్యక్రమాల్లో చాలా చురుగ్గా పాల్గొన్నారు. ఈసారి ఆందోల్ నుంచి తాను పోటీ చేయాలని భావించారు. బీజేపీ అధిష్టానం కూడా చివరి వరకు ఉదయ్‌కే టికెట్ ఇవ్వాలని నిర్ణయించుకుందట. కానీ, బాబు మోహన్ ప్రెస్ మీట్ పెట్టి మరీ బీజేపీ అధిష్టానం తీరుపై నిప్పులు చెరిగారు. ఆ క్రమంలో 3వ జాబితాలో ఆందోల్ టికెట్‌ను బాబు మోహన్కే కేటాయించింది బీజేపీ. దాంతో పార్టీ తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్న ఉదయ్.. ఇవాళ పార్టీలో చేరారు.
Also Read:
అమ్మను చూసి చాలా నేర్చుకున్నాను..కూతురు పుట్టిన తరువాత జీవితమే: కేటీఆర్!
హీరో ధనుష్ కుమారుడికి షాక్ ఇచ్చిన ట్రాఫిక్ పోలీసులు.. భారీ ఫైన్