Kannappa Movie: కలెక్షన్ కింగ్ మోహన్ బాబు (Mohan Babu) పెద్ద కుమారుడు మంచు విష్ణు(Manchu Vishnu) డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప (Kannappa Movie) అని అందరికీ తెలిసిందే. ఈ సినిమా మీద ఇప్పటికే అంచనాలు పెరుగుతున్నాయి. కొంత కాలం క్రితం న్యూజిలాండ్ లో ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ పూర్తి చేసుకుని భారత్ కు తిరిగి వచ్చింది చిత్ర బృందం. అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన మరో అప్డేట్ ను చిత్ర బృందం ఇచ్చింది. ఇప్పటి వరకు ఈ సినిమాలో మోహన్ బాబు, మోహన్ లాల్, ప్రభాస్(Prabhas) వంటి అగ్ర నటులందరూ నటిస్తున్నట్లు ఇంతకు ముందే మేకర్స్ ప్రకటించారు. అయితే తాజాగా మంచు వారి ఇంటి నుంచి మూడో తరం వారసుడు కూడా ఈ చిత్రంలో కనిపించబోతున్నట్లు తెలిపి అభిమానులను సర్ప్రైజ్ చేసింది చిత్ర బృందం.
మూడో తరం వారసుడు..
ఇప్పటికే మంచు వారి ఇంటి నుంచి మంచు విష్ణు, మనోజ్, లక్ష్మీ ప్రసన్న సినీ ప్రపంచానికి పరిచయం కాగా..తాజాగా ఇప్పుడు మంచు విష్ణు కుమారుడు అవ్రామ్ భక్తవత్సల్ మంచు (Awram Bhaktavatsal) కూడా కన్నప్పతో సినీ ప్రపంచంలోకి ఎంట్రీ ఇవ్వనున్నాడు. దీంతో ఈ చిత్రంలో మంచు వారి ఇంటి నుంచి మోహన్ బాబుతో కలుపుకొని అవ్రామ్ వరకు మూడు తరాల నటులు నటిస్తున్నట్లు అయ్యింది.
అవ్రామ్ ఎంట్రీ గురించి విష్ణు ఏమన్నారంటే..
తన కుమారుడు సినీ ఎంట్రీ గురించి విష్ణు మాట్లాడుతూ.. ”కన్నప్ప సినిమా నా జీవితంలో ఎంతో ముఖ్యమైన ప్రాజెక్టు. ఇందులో నా కుమారుడు అవ్రామ్ కీలక పాత్రలో నటిస్తుండడం చాలా గర్వంగా ఉంది. ఇది కేవలం సినిమా మాత్రమే కాదు. మా కుటుంబం నుంచి మూడు తరాల నటులు నటిస్తున్న చిత్రం.
అవ్రామ్ తో కలిసి ఈ సినిమా ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నా..మీ అందరి ఆశీర్వాదం కోరుకుంటున్నాను. కన్నప్ప సినిమా ప్రతి ఒక్కరికి ఒక అద్భుతమైన అనుభూతిని మిగుల్చుతుంది, ఇది మా కుటుంబంలో కొత్త అధ్యయానికి నాంది పలుకుతుంది” అంటూ విష్ణు పేర్కొన్నారు.
Also read: జుట్టు రాలిపోతుందా..అయితే కరివేపాకు నూనెను రాసేద్దాం!