Asia Cup 2023: ఆగస్టు 30 నుంచి ప్రారంభం కానున్న ఆసియాకప్ టోర్నీకి భారత జట్టును బీసీసీఐ (BCCI) ప్రకటించింది. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ (Ajit Agarkar) అధ్యక్షతన హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid), కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma), ఇతర సెలెక్షన్ కమిటీ సభ్యులు సమావేశమై 17 మందితో కూడిన తుది జట్టును వెల్లడించారు. కొంతకాలంగా గాయాలతో జట్టుకు దూరంగా ఉంటున్న శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, జస్ప్రీత్ బుమ్రా టీంలోకి కమ్ బ్యాక్ ఇచ్చారు. ఇటీవల వెస్టిండీస్ జట్టుతో జరిగిన టి20 సిరీస్‌లో అదరగొట్టిన తిలక్ వర్మపై నమ్మకం ఉంచిన సెలెక్టర్లు జట్టులో స్థానం కల్పించారు. ఇక సంజూ శాంసన్ బ్యాకప్ ప్లేయర్‌గా ఎంపికయ్యాడు.
ఉపఖండపు జట్లు ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ఆసియాకప్ (Asia Cup 2023) టోర్నీ కోసం పూర్తి స్థాయి జట్టును ప్రకటించారు సెలెక్టర్లు. గతేడాది జరిగిన ఆసియాకప్‌లో భారత ఆటగాళ్లు తీవ్రంగా నిరాశపరిచారు. దీంతో ఈసారి కప్ గెలవాలనే పట్టుదలతో బీసీసీఐ ఉంది. అందుకే ఫాంలో ఉన్న ఆటగాళ్లతో పాటు సీనియర్ ప్లేయర్లను ఎంపిక చేశారు. వరల్డ్‌కప్ లాంటి మెగా టోర్నీ ముందు జరుగుతున్న టోర్నీ కావడంతో ప్రయోగాలకు దూరంగా ఉన్నారు సెలెక్టర్లు. ఇదే జట్టు ప్రపంచకప్‌లో కూడా ఆడే అవకాశాలు ఉన్నాయి.
కాగా ఈ నెల 30 నుంచి పాకిస్థాన్, శ్రీలంక వేదికలుగా ఆసియాకప్ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ లో పాకిస్థాన్ జట్టు నేపాల్ జట్టుతో పోటీ పడనుంది. ఇక ప్రపంచమంతా ఎదురుచూస్తున్న భారత్-పాక్ మ్యాచ్ సెప్టెంబర్ 2న జరగనుంది. సెప్టెంబర్ 17న ఫైనల్ మ్యాచ్ ఉంటుంది. ఇక భారత్ వేదికగా అక్టోబర్ 5 నుంచి వరల్డ్‌కప్ టోర్నీ ప్రారంభంకానుంది. ఈ టోర్నీలో భాగంగా అక్టోబర్ 14న ఇండియా-పాక్ మ్యాచ్ గుజరాత్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ప్రారంభంకానుంది. నవంబర్ 19న ఫైనల్ మ్యాచ్ ఉంటుంది.
Here’s the Rohit Sharma-led team for the upcoming #AsiaCup2023 🙌#TeamIndia pic.twitter.com/TdSyyChB0b
— BCCI (@BCCI) August 21, 2023
Asia Cup 2023 భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, తిలక్ వర్మ, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా(వైస్ కెప్టెన్), శార్దుల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, బుమ్రా, సిరాజ్, షమీ, ప్రసిధ్ కృష్ణ, సంజూ శాంసన్( రిజర్వ్ ప్లేయర్)
Also Read: టీమిండియాకు గట్టి షాక్.. మరోసారి ఆ స్టార్ ప్లేయర్‌కి గాయం!