ఇండియన్ ఆర్మీలో చేరి దేశానికి సేవచేయాలని ఆసక్తి ఉన్న అభ్యర్థులకు ఆర్మీ గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లోకి ఆర్మీ ఆహ్వానిస్తోంది. సర్వీస్ సెక్షన్ బోర్డు (SSB)ద్వారా ఇంటర్వ్యూతో నియామకాలు జరుగుతాయి. ఇందులో ఎంపికైనవారికి శిక్షణ సమయంలో స్టైఫండ్ కూడా చెల్లిస్తారు. తర్వాత లెఫ్టినెంట్ హోదాతో ఉద్యోగాల్లోకి తీసుకుంటారు. ఈపోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హతతోపాటు ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఇండియన్ ఆర్మీ వెబ్ సైట్లో వివరాలు నమోదు చేసుకోవాలి. దరఖాస్తు రుసుము లేదా వచ్చిన దరఖాస్తులను బీటెక్ మార్కుల మెరిట్ ప్రకారం ఫైనల్ చేస్తారు. ఇందులో సెలక్ట్ అయినవానికి సర్వీస్ సెలక్షన్ బోర్డ్ బెంగళూరులో ఐదు రోజుల పాటు రెండు దశల్లో సైకలాజికల్ పరీక్షలు, గ్రూప్ పరీక్షలు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు.
వీటిని సైకాలజిస్ట్, గ్రూప్ టెస్టింగ్ ఆఫీసర్, ఇంటర్య్వైూయింగ్ ఆఫీసర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తారు. మొదటిరోజు స్టేజ్ 1 స్క్రీనింగ్ పరీక్షలు ఉంటాయి. ఇందులో అర్హత సాధిస్తే..స్టేజ్ 2కి సెలక్ట్ అవుతారు. వీరికి నాలుగు రోజుపాలపాటు పలు విభాగాల్లో పరీక్షిస్తారు. అందులో రాణించినవారికి మెడికల్ టెస్టులు నిర్వహించి ట్రైనింగ్ కు తీసుకుంటారు. అంతేకాదు ఈ ఇంటర్వ్యూకి హాజరైనవారికి కూడా ప్రయాణఖర్చులు టీజీసీనే చెల్లిస్తుంది.
ఇది కూడా చదవండి: నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త.. వేయికి పైగా ఉద్యోగాలకు నోటిఫికేషన్..!!
శిక్షణ:
ఇందులో సెలక్ట్ అయినవారికి ఇండియన్ మిలటరీ అకాడమీ డెహ్రాడూన్ జులై 2024 నుంచి సుమారు ఏడాది పాటు ట్రైనింగ్ ఉంటుంది. ఈ సమయంలో ప్రతినెలా రూ. 56,100 స్టైఫండ్ గా చెల్లిస్తారు. ట్రైనింగ్ పూర్తిచేసుకున్నవారిని లెఫ్టినెంట్ హోదాతో విధుల్లోకి తీసుకుంటారు. ఉద్యోగంలో చేరిన తర్వాత రూ. 56,100 వేతనంతోపాటు 15,500మిలటరీ సర్వీస్ పే అందుతుంది. వీటికి డీఏ, ఇతర ప్రోత్సాహకాలు కూడా అదనంగా ఉంటాయి. సుమారు లక్షకు పైగా జీతం అందుకోవచ్చు.
ఖాళీలు
30
విభాగాల వారీగా ఖాళీలు:
-సివిల్ పరిధిలో 7
-కంప్యూటర్ సైన్స్ 7
-ఎలక్ట్రికల్ అనుబంధ విభాగాల్లో 3
-ఎలక్ట్రానిక్స్ అనుబంధ విభాగంలో 4
-మెకానికల్ 7
-ఇతర విభాగాల్లో 2
అర్హత:
పై పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు అనుబంధ బ్రాంచీల్లో ఇంజనీరింగ్ పూర్తి చేసి…లేదా ఆఖరు సంవత్సరం కోర్సుల్లో ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. అన్ని ఖాళీలకు అవివాహిత పురుషులే అర్హలు
వయస్సు:
జులై 1,2024 నాటికి 20 నుంచి 27ఏళ్లలోపు ఉండాలి.
దరఖాస్తులు:
ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తారు. అక్టోబర్ 26 మధ్యాహ్నం 3 వరకు దరఖాస్తు చేసుకోవాలి. https://joinindianarmy.nic.in/
ఇది కూడా చదవండి:తెలంగాణలో మరో 670 ఉద్యోగాలకు నోటిఫికేషన్.. నిరుద్యోగులకు మంత్రి శుభవార్త