Ariyana Glory: బుల్లితెర ప్రేక్షకులకు ఈ అమ్మడు గురించి చెప్పాల్సిన అవసరం లేదు. బోల్డ్ బ్యూటీ గా సోషల్ మీడియాలో ఫుల్ క్రేజ్ సొంతం చేసుకుంది. అరియనా. నచ్చించి ఓపెన్ గా చెప్పేయడం, భయం లేకుండా స్ట్రెయిట్ గా మాట్లాడడం అరియానకు స్పెషల్ ఇమేజ్ తెచ్చాయి.
సోషల్ మీడియాలో సూపర్ యాక్టివ్ గా ఉండే ఈ బ్యూటీ .. ఎప్పటికప్పుడు తన గ్లామర్ ట్రీట్ ఇస్తూనే ఉంటుంది. ఇటీవలే స్విమ్ సూట్ లో ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోలు నెట్టింట్లో వైరల్ గా మారాయి. ఇక తాజాగా మరో లేటెస్ట్ ఫోటోలను షేర్ చేసింది. ట్రెండీ హెయిర్ స్టైల్, ఓపెన్ జాకెట్ విత్ మినీ గౌన్ తో ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటుంది. స్టన్నింగ్ లుక్స్ లో అరియనను చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.
యాంకర్ గా కెరియర్ మొదలు పెట్టిన అరియనా పలు టీవీ షోస్ లో వ్యాఖ్యాతగా చేసింది. జెమినిలో ప్రసారమయ్యే కెవ్వు కామెడీ షోతో యాంకర్ గా ఫేమస్ అయ్యింది ఈ బ్యూటీ. అరియనా అసలు పేరు అర్చన.. ఈ పేరుతో కలిసి రావడం లేదని.. అరియనా గ్లోరీ గా తనను ప్రేక్షకులకు పరిచయం చేసుకుంది ఈ బోల్డ్ బ్యూటీ.
అప్పట్లో ఆర్జీవీతో అరియనా చేసిన ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో తెగ వైరలైంది. ఈ ఇంటర్వ్యూ తో అరియానాకు ఫుల్ క్రేజ్ వచ్చింది. ఇదే క్రేజ్ తో బిగ్ బాస్ ఆఫర్ కొట్టేసింది ఈ అందాల భామ. బిగ్ బాస్ తర్వాత అరియనా పాపులారిటీ మరింత పెరిగింది. షోలో తన ఫ్రాంక్ నెస్ తో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఆ తర్వాత బిగ్ బాస్ సీజన్ 5 బజ్ హోస్ట్ గా ఛాన్స్ కొట్టేసింది.
బిగ్ బాస్ తో ఫుల్ ఫేమసైన ఈ బ్యూటీ వరుస అవకాశాలతో బిజీ అయిపొయింది. మా టీవీ, జీ తెలుగు, ఈ టీవీలో పలు షోస్, వెబ్ సీరీస్, చేస్తూ బిజీగా ఉంది. రీసెంట్ గా రాజ్ తరుణ్ నటించిన ‘అనుభవించు రాజా’ సినిమాలో చిన్న రోల్ లో కనిపించింది.
Also Read: Honey Rose: ఆరంజ్ కలర్ డ్రెస్లో బాలయ్య హీరోయిన్ కొత్త లుక్ .. వైరలవుతున్న వీడియో