Eye Kajal: అమ్మాయిల అలంకరణలో కంటికి పెట్టే కాటుక ముఖ్య పాత్ర పోషిస్తుంది. కంటికి కాజల్ పెట్టిన తర్వాత అమ్మాయిల అందం మరింత రెట్టింపు అవుతుంది. పెద్దవారు మాత్రమే కాదు చిన్నపిల్లల కళ్ళకు కూడా కాటుక పూసే సంప్రదాయం భారత దేశంలో ఇప్పటికీ కొనసాగుతుంది. ఇలా చేయడం వల్ల పిల్లల కళ్ళు పెద్దవుతాయని, చెడు ద్రుష్టి పడదని నమ్ముతారు. అయితే పిల్లలకు కాటుక పెట్టడం చాలా ప్రమాదమని చెబుతున్నారు నిపుణులు. కాటుక తయారీలో ఉపయోగించే సీసం(లోహం) పిల్లల ఆరోగ్యం పై ప్రతికూల ప్రభావం చూపుతుంది. పిల్లలకు మాత్రమే కాదు పెద్దలకు కూడా మంచిది కాదు. అసలు కాటుక పెట్టడం వల్ల కలిగే దుష్ప్రభావాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాము…
సీసం కల్తీ
కొన్ని కాటుక తయారీలలో రంగును ముదురు చేయడానికి సీసం ఉపయోగించబడుతుంది. ఈ సీసం ఆరోగ్యానికి చాలా హానికరం. ఇది కళ్ళలో దురద, ఎరుపును కలిగించడమే కాకుండా పిల్లల బ్రెయిన్ డెవలప్మెంట్ కు ఆటంకం కలిగిస్తుంది. అందువల్ల దీని సైడ్ ఎఫెక్ట్స్ ను నివారించడానికి ఇంట్లోనే దీపంతో తయారు చేసిన కాజల్ ఉపయోగించడం ఉత్తమం. అంతేకాదు లిప్స్టిక్, పసుపు, మసాలా దినుసులు వంటి అనేక వస్తువుల తయారీలో సీసం ఉపయోగిస్తారు.
ఇన్ఫెక్షన్
చాలా సందర్భాల్లో పిల్లలు తమ చేతులతో కాజల్ ను కళ్ళ పై రుద్దడం చేస్తుంటారు. దీని వల్ల చర్మ వ్యాధులకు గురయ్యే ప్రమాదం ఉంది. చర్మం పై కాటుక వ్యాపించడం ద్వారా చిన్న చిన్న దద్దుర్లు, మొటిమలు, చిరాకు రావచ్చు. అంతే కాదు ఆ చేతులను పిల్లలు నోట్లో పెట్టుకునే ప్రమాదం కూడా ఉంటుంది.
కంటి చూపు
చిన్న పిల్లల కళ్ళల్లో ఎక్కువ మొత్తంలో కాటుక అప్లై చేయడం ద్వారా కళ్ళ మధ్య ప్రాంతాన్ని దెబ్బతీస్తుంది. దీనిని కార్నియా అని పిలుస్తారు. కంటిలోని ఈ భాగం చాలా సున్నితంగా ఉంటుంది. ఈ భాగంలో కాటుక పెట్టడం వల్ల కంటి చూపు దెబ్బతింటుంది.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
Also Read: Health: ఈ కూరగాయలను తక్కువగా ఉడికించండి.. లేదంటే పోషకాలు నశిస్తాయి..! – Rtvlive.com